Breaking News

విద్యుత్ రంగం బలోపేతమే లక్ష్యం


-ఏపీ విద్యుత్ సంస్థలను సాంకేతికంగా, ఆర్థికంగా బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి
-విద్యుత్ ఉత్పత్తి , ప్రసారం, పంపిణి వ్యవస్థల బలోపేతం
-భవిష్యత్లోనూ 24x 7 నాణ్యమైన విద్యుత్ సరఫరాకు భరోసా
– కె విజయానంద్, ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి
-పునరుత్పాదక ఇంధన రంగాన్ని విస్తరించేందుకు కృషి
-సర్ మోక్షగుండం విశ్వేశ్వరాయ నూతన విగ్రహ ఆవిష్కరణ
-సర్ మోక్షగుండం విశ్వేశ్వరాయను ఇంజినీర్లంతా ఆదర్శంగా తీసుకోవాలి

విజయవాడ, నేటి పత్రిక ప్రజా వార్త :
విద్యుత్ రంగాన్ని సాంకేతికంగా ఆర్థికంగా బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కే విజయానంద్ తెలిపారు . వినియోగదారులకు అందుబాటు ధరల్లో 24x 7 నిరంతర , నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయడమే ప్రభుత్వ లక్ష్యమని వివరించారు.

భారత రత్న సర్ మోక్షగుండం విశ్వేశ్వరాయ జయంతి సందర్భంగా డాక్టర్ నార్ల టాటా రావు థర్మల్ పవర్ స్టేషన్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో APSEB ఇంజనీర్స్ అసోసియేషన్ నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ఇంజినీర్లను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ విద్యుత్ కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన మోక్షగుండం విశ్వేశ్వరాయ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ ఆంధ్ర ప్రదేశ్ విద్యుత్ సంస్థలను దేశంలోనే అత్యుతమ సంస్థలుగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందన్నారు. ఇందులో భాగంగా విద్యుత్ సంస్థల్లో అంతర్గత సామర్ధ్యాన్ని అభివృద్ధి చేయడం, నూతన సాంకేతికతను ప్రవేశ పెట్టడం, విద్యుత్ ఉత్పత్తి, ప్రసార పంపిణి వ్యవస్థల్ని బలోపేతం చేయడం, మౌలిక సదుపాయాల అభివృధి వంటి అనేక కార్యక్రమాలను అమలు చేస్తున్నట్లు తెలిపారు.అలాగే వినియోగదారుల ఆకాంక్షలకు అనుగుణంగా విద్యుత్ సంస్థలను తీర్చిదిద్దటమేగాక వారికి సత్వర సేవలు అందించేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

రాష్ట్రంలోని వినియోగదారులకు భవిష్యత్లోనూ 24x 7 నిరంతర, నాణ్యమైన విద్యుత్ సరఫరాకు పూర్తి స్థాయి భరోసా కల్పించేందుకు ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి , ఇంధన శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి అనేక చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. దీనిలో భాగంగా పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి సామర్ధ్యాన్ని పెంచేందుకు ప్రభుత్వం నిర్మాణాత్మక చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.

రాష్ట్రంలోని సహజ వనరులను ఉపయోగించుకొని విద్యుత్ సామర్ధ్యాన్ని పెంచడం ద్వారా వినియోగదారులకు పుష్కలంగా విద్యుత్ ను అందుబాటు ధరల్లో అందించాలని ముఖ్యమంత్రి కృత నిశ్చయం తో ఉన్నారని ఆయన తెలిపారు. దీనివల్ల రాష్ట్రంలో పారిశ్రామిక , ఆర్థికాభివృద్ధి సాధించడంతో పాటు ప్రజల జీవన ప్రమాణాలు కూడా మెరుగవుతాయని ఆయన పేర్కొన్నారు.

రాష్ట్రంలోని విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం పెంచడంలో భాగంగా శ్రీ దామోదర సంజీవయ్య థర్మల్ పవర్ స్టేషన్ (SDSTPS) కృష్ణపట్నం స్టేజ్-II (1x800MW) వాణిజ్య కార్యకలాపాలు అక్టోబర్-2022లోనూ , అలాగే డాక్టర్ నార్ల టాటా రావు థర్మల్ పవర్ స్టేషన్ (డా.NTTPS) ) స్టేజ్-V (1x800MW) ఫిబ్రవరి-2023 నాటికి ప్రారంభమవుతాయి.

అంతేగాక పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి ని పెంచడంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం పునరుత్పాదక ఇంధన పాలసీ 2020 ను ఇప్పటికే ప్రకటించిందన్నారు.

ఇందులో భాగంగా సౌర, పవన విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం పెంచేందుకు చర్యలు , మరియు పంప్డ్ హైడ్రో స్టోరేజీ ప్రజెక్టులు చేపడుతున్నట్లు వివరించారు . ఈ ప్రజెక్టులు పూర్తయితే రాష్ట్రంలో మిగులు విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం సాధించే లక్ష్యాన్ని చేరుకోగలుగుతాం అన్నారు . అలాగే ఇతర రాష్ట్రాలకు కూడా విద్యుత్ ఎగుమతి చేయగలుగుతామని పేర్కొన్నారు.

విద్యుత్ శాఖ లో ఉన్న ఇంజినీర్లు, ఇతర సిబ్బంది అంకితభవంతో కృషి చేస్తే రాష్ట్ర విద్యుత్ సంస్థలను దేశంల లో ప్రధమ స్థానంలో నిలపడం అసాధ్యం కాదని పేర్కొన్నారు. సాంకేతికత అంతగా అందుబాటులో లేని రోజ్జుల్లో సర్ మోక్షగుండం విశ్వేశ్వరాయ ఇంజనీర్ గా ఎన్నో అద్భుతాలు చేసేరని ఆయన పేర్కొన్నారు. నేటి తరం ఇంజినీర్లు ఆయనని ఆదర్శంగా తీసుకుని రాష్ట్రానికి , దేశానికీ కీర్తి ప్రతిష్టులని తెచ్చేలా కృషి చేయాలనీ ఆకాంక్షించారు.

సర్ మోక్షగుండం విశ్వేశ్వరాయ దేశానికీ చేసిన సేవలను గుర్తిస్తూ భారత ప్రభుత్వం 1955 లో భారత్ రత్న సత్కరించడం ఇంజినీర్లందరికి గర్వకారణం అన్నారు. ఆయన అందించిన స్ఫూర్తి తో రాష్ట్రానికి, ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు అంకితభావంతో కృషిచేయాలని ఆయన విజ్ఞప్తి చేసారు.

ఏపీ ట్రాన్స్కో సిఎండీ బీ శ్రీధర్ మాట్లాడుతూ రాష్ట్రములో పెరుగుతున్న విద్యుత్ డిమాండ్ దృష్టిలో పెట్టుకుని విద్యుత్ ఉత్పత్తిని, సామర్ధ్యాన్ని పెంచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. వచ్చే ఏడాది మార్చీ నాటికి రాష్ట్రములో విద్యుత్ డిమాండ్ రోజుకు 250 మిలియన్ యూనిట్లకు చేరుకునే అవకాశం ఉందన్నారు.

ఏ పీ ట్రాన్స్కో జేఎండీలు ఐ పృధ్వి తేజ్, బి మల్లా రెడ్డి, డిస్కమ్ల సీఎండీలు కె సంతోషరావు, జె పద్మ జనార్దన రెడ్డి, ఏపీజెన్కో డైరెక్టర్లు జి చంద్రశేఖర్ రాజు, బి వెంకటేశులు రెడ్డి, ఆంటోని రాజా, ఎంవివి సత్యనారాయణ, సయ్యద్ రఫీ, ఎపిట్రాన్స్కో డైరెక్టర్లు. భాస్కర్, డి జయభారతరావు, సిఇలు అశోక్కుమార్రెడ్డి, పి నవీన్ గౌతమ్ గౌరవ అతిథిగా హాజరయ్యారు.

కార్యక్రమానికి APSEB ఇంజినీర్ల సంఘం అధ్యక్షుడు, జీబీ శ్రీనివాసరావు, అసోసియేట్ ప్రెసిడెంట్, K నాగ ప్రసాద్ మరియు సెక్రటరీ జనరల్ P ప్రతాప రెడ్డి మరియు ఏ పీ ట్రాన్స్కో , ఏ పీ జెన్కో ఏ పీ డిస్కాములు ఇంజినీర్లు అసోసియేషన్ల అధికారులు హాజరై విగ్రహావిష్కరణను ఘనంగా నిర్వహించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

విజయవాడ ఆయుర్వేద కళాశాలలో ఘనంగా 11వ జాతీయ ఆయుర్వేద దినోత్సవ వేడుకలు

-ధన్వంతరి హోమం నిర్వహణ -సిసిఆర్ఎసి – స్పార్క్ స్కాలర్‌షిప్ చెక్కుల పంపిణీ -ప్రతిభావంతులైన విద్యార్థులకు అవార్డులు విజయవాడ, నేటి పత్రిక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *