Breaking News

సంక్షేమ అభివృద్ధి పథకాల్లో సంచార జాతులకు ప్రాధాన్యతనివ్వాలి…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి పథకాల్లో సంచార జాతులకు ప్రాధాన్యతనివ్వాలని అభివృద్ధి, సంక్షేమ బోర్డు డి నోటిఫైడ్ సంచార మరియు పాక్షిక సంచార కమిటీ కేంద్ర సభ్యులు తురకా నరసింహా అన్నారు.

కలెక్టరేట్ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో శనివారం కేంద్ర సభ్యులు తురకా నరసింహా అధికారులతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా అయన మాట్లాడుతూ విద్య ద్వారానే సామజిక అభివృద్ధి సాధ్యపడుతుందని సమాజంలో షెడ్యూల్డ్ కులాలు, తెగలు, బలహీనవర్గాల విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలన్నారు. ఎస్ సి, ఎస్ టి, బిసి, ఓసి వర్గాల్లోనూ సంచార జాతులు ఉన్నారని వారిని గుర్తించేందుకు ప్రత్యేక కమిషన్ లు ఏర్పాటు చేయడం జరిగిందని ఆ కమిషన్ లు తమకు నివేదికలు అందిస్తున్నాయని సభ్యులు అన్నారు. డీ నోటి ఫైడ్ సంచార ఉప సంచార తెగల అభివృద్ధి నిమిత్తం కేంద్ర ప్రభుత్వం జాతీయ కమిషన్ ఏర్పాటు చేసిందన్నారు. రాష్ట్రంలో సంచార జాతులకు ప్రత్యేక బోర్డు, ప్రత్యేక బడ్జెట్ ప్రవేశ పెట్టడం జరిగిందని చెప్పారు. ఆర్ధిక, సాంఘిక, విద్య, వైద్య, ఆరోగ్య రంగాలలో సంచార జాతుల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తున్నదన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసిన సంక్షేమ పధకాలను అట్టడుగు ప్రజలకు చేరువ చేయాలని సభ్యులు అన్నారు. కేంద్ర ప్రభుత్వం సంచార జాతుల సంక్షేమానికి ప్రత్యేక బోర్డు ను ఏర్పాటు చేయడంతో పాటు వారి స్థితిగతులు జీవన శైలి పై నివేదికలకు చర్యలు తీసుకుంటున్నదన్నారు. అధికారులు సంచార జాతుల అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై నరసింహారావు అవగాహన కల్పించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పధకాలు అట్టడుగు ప్రజలకు అందేలా అధికారులు కృషి చేయాలన్నారు. విద్యా, వైద్యం ఉపాధి నీరు పేదలకు చేరువ అయితేనే దేశం మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల్లో సంచార జాతులు వెనుకబడిన కులాల వారికి ప్రాధాన్యతనిచ్చి అభివృద్ధికి పాటుపడాలన్నారు.

ఉత్తమ సమాజ నిర్మాణానికి విద్య పాత్ర కీలకమైనదని, విద్యార్థులకు అర్ధమయ్యే రీతిలో ఆకట్టుకునేలా బోధన ఉండాలని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన నూతన విద్యా విధానంపై ముఖ్యంగా ప్రధాన సబ్జెక్ట్ లు అయిన గణితం, రసాయన శాస్త్రం, సామాన్య శాస్త్రం, సాంఘిక శాస్త్రం తదితర సబ్జెక్ట్ లలో ఏ విధంగా బోధించాలనే దానిపై వివరించారు. నూతన విద్యా విధానాన్ని పూర్తిగా పరిశీలించి సూచనలు చేయాలని సబ్జెక్టు నిపుణులను కోరారు. ప్రస్తుతం అమలు జరుగుతున్న నూతన విద్యా విధానాన్ని స్థూల సూక్ష్మంగా పరిశీలించి డాక్యూమెంటేషన్ చేయాలన్నారు. సి బి ఎస్ ఈ, ఐ సి ఎస్ ఈ సిలబస్ ను ప్రస్తుతం బోధనలో ఉన్న సిలబస్ ను బేరీజు వేసుకుని సబ్జెక్ట్ ల వారీ పరిశీలించి మార్పులు చేర్పులు సూచించాలన్నారు. వేదాలు, ఉపనిషత్తులు, గురుకులాలు మన సంస్కృతిలో భాగమని ప్రపంచానికే విజ్ఞానాన్ని అందించిన ఘనత మనది అని ప్రపంచ ప్రసిద్ధి చెందిన తక్షశిల, నలంద వంటి చారిత్రక విద్యాలయాల్లో విదేశాల నుండి మన దేశానికి వచ్చి విద్యను అభ్యసించేవారని గుర్తుచేశారు. వేమన, సుమతి శతకాలు, అన్నమయ్య కీర్తనలు, స్వామి వివేకానంద బోధనలు, బౌద్ధ, జైన సిద్ధాంతాలు, రామాయణ, మహాభారతం వంటి ఇతిహాసాలు ప్రతీ విద్యార్థికీ నేర్పవల్సిన బాధ్యత ఉపాధ్యాయులమీద ఉందన్నారు.

జిల్లా కలెక్టర్ ఎస్. ఢిల్లీ రావు మాట్లాడుతూ అన్ని సబ్జెక్ట్ లలోనూ అపార జ్ఞానం కలిగిన కేంద్ర సభ్యులు విద్యార్థులకు బోధించాల్సిన విధానాన్ని అర్ధమయ్యే రీతిలో చక్కగా వివరించారన్నారు. జిల్లాలో సంచార జాతుల అభివృద్ధికి సభ్యుల కృషి తోడ్పాటును ఇస్తుందన్నారు. ప్రభుత్వ సంక్షేమ పధకాలను సంచార జాతులు సద్వినియోగం చేసుకునేలా అధికారులు కృషి చేయాలని కలెక్టర్ కోరారు.

సమావేశంలో జాయింట్ కలెక్టర్ నుపూర్ అజయ్, డి ఆర్ ఓ కె. మోహన్ కుమార్, బి సి కార్పొరేషన్ కార్య నిర్వాహక సంచాలకులు సి. హెచ్. లక్ష్మి దుర్గ, జిల్లా విద్యా శాఖాధికారిణి సి.వి. రేణుక, జిల్లా గిరిజన సంక్షేమ శాఖాధికారి రుక్మాoగదయ్య, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారిణి డా. ఎమ్. సుహాసిని, జిల్లా ఎస్.సి. వెల్ఫేర్ మరియు ఎంపవర్ అధికారిణి బి. వి. విజయ భారతిలు ఉన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *