విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం పేరు మార్చాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెనుకకు తీసుకోవాలని కోరుతూ టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కి రాష్ట్ర టీడీపీ అధ్యక్షులు కింజరాపు అచ్చె న్నాయుడు, ఎంపిలు కేశినేని శ్రీనివాస్ (నాని), కనకమేడల రవీంద్ర మరియు టీడీపి ఎమ్మెల్యేలు, నాయకుల బృందం కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వర్ల రామయ్య పయ్యావుల కేశవ్, బచ్చుల అర్జునుడు, ఎం వి సత్యనారాయణ రాజు, బీటి నాయుడు, వెలగపూడి రామకృష్ణ, వర్ల రామయ్య నక్కా ఆనందబాబు, బెందాలం అశోక్ తదితరులు పాల్గొన్నారు
Prajavartha Online Telugu News