విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
“ఆంధ్ర, తెలంగాణ వినియోగదారుల హక్కుల సంస్థ సిఎన్జి, ఎల్పిజి గ్యాస్ పై అవగాహన సదస్సు” జాతీయ అధ్యక్షులు నవీన్ శర్మ, కార్యదర్శిలు వికాస్ పాండే, ఆదేశాల మేరకు ఆంధ్రా రాష్ట్ర అధ్యక్షులు గొర్లే శ్రీనివాస నాయుడు, రాష్ట్ర కార్యదర్శి వాసుదేవ్ రావు నాయకత్వంలో విజయవాడ ప్రెస్ క్లబ్ లో జరిగింది. ఈ సందర్భంగా వారు విలేకరులతో మాట్లాడుతూ ఎన్. టి.అర్ జిల్లా విజయవాడలో గ్యాస్ సిలిండర్ రూల్స్ 2004/2016 చట్ట ప్రకారం ఉన్న నియమాలను పాటించనటువంటి సిఎన్జి మరియు ఎల్పిజి గ్యాస్ వాహనాల యజమానులకు మరియు సిఎన్జి ఎల్పిజి వేస్తున్నటువంటి విజయవాడలో 56 బంక్ ల లో సుమారు 20 పైన పెట్రోల్ బంకులకు అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది అని రాష్ట్ర అధ్యక్షులు అన్నారు. గ్యాస్ సిలిండర్ రూల్స్ ప్రకారం వాహనానికి అమర్చినటువంటి ప్రతి సిలిండర్ సిఎన్జి అయితే మూడు సంవత్సరాలకు ఒకసారి ఎల్పిజి అయితే ఐదు సంవత్సరాలకు ఒకసారి తపనిసరిగా హైడ్రో టెస్టింగ్ కి వెళ్లాల్సి ఉంటుంది, లేనియెడల గ్యాస్ పోసే సమయంలో గానీ లేదా వాహనం నడుస్తున్న సమయం లో గానీ వాహనాన్ని ఆమర్చిన సిలిండర్ పెలి ప్రాణనష్టం జరిగే అవకాశాలున్నాయి ఇలా సిఎన్జి , ఎల్పిజి వాహనదారులు రూల్స్ ప్రకారం గడువు తేదీల్లో టెస్ట్ చేయించిన వాహనానికి అమర్చిన సిలిండర్ యొక్క పూర్తిగడువు 20 సంవత్సరాలు మాత్రమే ఉంటుంది తర్వాత కొత్త సిలిండర్ మార్చాల్సి ఉంటుంది అన్నారు. ప్రస్తుతం విజయవాడలోనే సుమారు గా 50వేల పైచిలుక సిఎన్జి వాహనాలు తిరుగుతున్నాయి ఇందులో సుమారు 60 శాతం వాహనాలు గడువు తేదీ ముగించుకొని కొన్న సమయం నుంచి ఇప్పటివరకు ఒక్కసారి కూడా టెస్టింగ్ వెళ్లకుండా తిరుగుతున్నాయి తెల్పరు అలా వాహనాల యజమానులకు అవగాహన కల్పించాలి. పెట్రోల్ బంక్ వారు అటువంటి వాహనాలపై, అధికారులు చర్యలు తీసుకునే విధంగా సమాచారం ఇవ్వాలి అని అవగాహన కల్పిస్తూ పూర్తి సమాచారం పెట్రోల్ బంక్ వారికి వివరించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా విచ్చేసిన తెలంగాణ కన్జ్యూమర్స్ ఆర్గనైజేషన్ స్టేట్ జనరల్ సెక్రటరీ రామగిరి హరిబాబు తెలంగాణ వైస్ ప్రెసిడెంట్ గుడపర్తి శివకుమార్, గ్రేటర్ హైదరాబాద్ ప్రెసిడెంట్ మాతంగి శుభం రాజు, హైదరాబాద్ వర్కింగ్ ప్రెసిడెంట్ వల్లాల రవి, అదిలాబాద్ డిస్టిక్ ప్రెసిడెంట్ కుమార్, సెక్రెటరీ షేక్ ఇర్ఫాన్ తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News