-రాష్ట్ర హోం, జిల్లా ఇన్చార్జ్ మంత్రి డా. తానేటి వనిత
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
ఈనెల 26వ తేదీ నుండి అక్టోబర్ 5వ తేదీ వరకు నిర్వహించే శరన్నవరాత్రి ఉత్సవాలకు చేస్తున్న ఏర్పాట్లను గురువారం అమ్మవారి ఆలయ పరిసర ప్రాంతాలను రాష్ట్ర హోం మంత్రి, జిల్లా ఇన్చార్జ్ మంత్రి వర్యులు డా. తానేటి వనిత పరిశీలించారు. ఇంద్రకీలాద్రి పరిసర ప్రాంతాలను, పున్నమిఘట్, పార్కింగ్ ప్రాంతం, క్యూ లైన్లు, కేశఖండన ప్రాంతాలను మంత్రి తానేటి వనిత పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మట్లాడుతూ అమ్మవారి దర్శనానికి వచ్చేభక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లను పూర్తి చేయాలని, కృష్ణానదీ ఉదృతంగా ప్రవసిస్తున్న తరుణంలో సాన్నం ఘట్టాల వద్ద భద్రత పెంచాలని పోలీసు అధికారులను హోం మంత్రి సూచించారు. తొలుత హోం మంత్రి ఇంద్రకీలాద్రి పై వేంచేసిఉన్న కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ ఈవో భ్రమరాంభ, ప్రధాన అర్చుకులు మంత్రి తానేటి వనితకు అమ్మవారి తీర్థప్రసాదాలు అందజేశారు. పరిశీలనలో జిల్లా కలెక్టర్ యస్. డిల్లీరావు, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, శాసనసభ్యులు వెలంపల్లి శ్రీనివాసరావు, పోలీస్ కమీషనర్ కాంతి రానా టాటా, శాసనమండలి సభ్యులు రహుల్లా, డిప్యూటి మేయర్ బెల్లం దుర్గ, డిఆర్వో కె. మోహన్‌కుమార్ తూర్పు నియోజకవర్గ ఇన్చార్జ్ దేవినేని అవినాష్, వివిధ శాఖల జిల్లా అధికారులు ఉన్నారు.
Prajavartha Online Telugu News