Breaking News

శరన్నవరాత్రి ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
శరన్నవరాత్రి ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి సిద్దం చేశామని జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు అన్నారు. ఈనెల 26వ తేది నుండి అక్టోబర్‌ 5వ తేది వరకు నిర్వహించే దసరా ఉత్సవాలకు భక్తులకు చేసిన ఏర్పాట్లపై శనివారం కలెక్టరేట్‌ వీడియోకాన్ఫరెన్స్‌ హాల్‌ నందు నగరపోలీస్‌ కమీషనర్‌ కాంతి రానా టాటా, ఆలయ ఇవో భ్రమరాంభలతో కలిసి కలెక్టర్‌ ఎస్‌. డిల్లీరావు పాత్రికేయుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
ఈసందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ శరన్నవరాత్రి ఉత్సవాలకు రాష్ట్ర నాలుమూలల నుండి 14 లక్షల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకునే అవకాశం ఉందన్నారు. ఈనెల 26వ తేది నుండి 1వ తేది వరకు రోజుకు 60 వేల మంది భక్తులతో 3 లక్షల 50 వేల మంది, అక్టోబర్‌ 2వ తేది నుండి 5వ తేది వరకు 1లక్ష 50వేల మంది భక్తులతో 6 లక్షలు, అక్టోబర్‌ 2వ తేది ఆదివారం మూలనక్షత్రం రోజున 2 లక్షల వరకు, అనంతరం 6,7 తేదీలలో 2 లక్షల 50 వేల మంది భక్తులు మొత్తంగా 14 లక్షల మంది భక్తులకు ఏర్పాట్లు చేశామని కలెక్టర్‌ అన్నారు.

క్యూలైన్‌లు :
వినాయకుడి గుడి నుండి టోల్‌ గేటు ద్వారా కొండపైకి ఓం టర్నింగ్‌ వరకు 3 క్యూ మార్గాలు, ఓం టర్నింగ్‌ వద్ద అదనంగా ఉచిత దర్శనానికి, విఐపిలకు ఒక్కొక్క క్యూలైన్‌ చొప్పున 5 క్యూలైన్‌లు వాటర్‌ ప్రూఫ్‌ షామియానాలతో ఏర్పాట్లు చేశామన్నారు.

ప్రసాదం కౌంటర్లు:
ఉత్సవాలకు 20 లక్షల లడ్డు ప్రసాదములు అందుబాటులో ఉంచామన్నారు. కొండదిగువన కనకదుర్గ నగర్‌ వద్ద 13 ప్రసాదం కౌంటర్లు, కొండపైన ఓం టర్నింగ్‌, పున్నమిఘాట్‌, బస్టాండ్‌, రైల్వేస్టేషన్‌, స్టేట్‌ గేస్ట్‌ హౌస్‌ వద్ద ఒక్కొక్క కౌంటర్‌ ఏర్పాటు చేశామన్నారు.

షవర్‌(జల్లు స్థానాలు) ఏర్పాట్లు:
మొత్తంగా 800 షవర్‌లు ఏర్పాటు చేశామన్నారు. వీటిలో సీతమ్మవారి పాదాల నుండి దోభి ఘాట్‌ వరకు 500, పున్నమి ఘాట్‌ వద్ద 200, భవానీ ఘాట్‌ వద్ద 100 ఉన్నాయన్నారు.

కేశఖండన శాలలు :
భక్తులు తలనీలాలు సమర్పించుకునేందుకు సీతమ్మవారి పాదాల వద్ద తాత్కాలిక షెడ్డ్‌ ఏర్పాటు చేశామన్నారు. ప్రతి షిప్టుకు 200 మంది, భవానీ ఘాట్‌, పున్నమీ ఘాట్‌ వద్ద షప్టుకు 50 మంది నాయి బ్రాహ్మణులు అందుబాటులో ఉంటారన్నారు.

వైద్య ఆరోగ్య సేవలు:
కొండపైన, దిగువున, ఘాట్ల వద్ద వైద్య ఆరోగ్య శాఖ ద్వారా 15 మెడికల్‌ క్యాంపులు ఏర్పాలు చేసి అత్యవసర మందులను, వియంసి, ఓం టర్నింగ్‌ వద్ద 6 బెడ్లు ఆసుపత్రులు అందుబాటులో ఉంచామన్నారు.

భక్తులకు 300, 100రూపాయల టిక్కెట్లు అన్‌లైన్‌లో అందుబాటులో ఉన్నాయన్నారు. విఐపిలకు 500 రూపాయల టిక్కెట్లు అందుబాటులో ఉండేటా రాష్ట్ర ప్రభుత్వ అతిధి గృహాం, కలెక్టరేట్‌, నగరపాలక సంస్థ, టూరిజం గేస్టహౌస్‌ ఎదురుగా, టోల్‌గేటు, ఓం టర్నింగ్‌ వద్ద ఏర్పాటు చేశామన్నారు.
అన్ని ఘాట్‌ల వద్ద స్విమ్మర్లను ఏర్పాటు చేశామన్నారు. 150 తాత్కాలిక మరుగుదొడ్లను ఏర్పాటు చేశామన్నారు. మూడు షిప్టులలో 800 మంది అధికారులకు విధులను కేటాయించమన్నారు. సంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. వృద్దులు, వికాలంగులకు ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్నారు. విఐపి, వివిఐపిలకు వివిధ ప్రాంతాలనుండి 21 వాహనాలు ఏర్పాటు చేశామని కలెక్టర్‌ డిల్లీరావు తెలిపారు.
నగర పోలీస్‌ కమీషనర్‌ కాంతి రానా టాటా మాట్లాడుతూ శరన్నవరాత్రి ఉత్సవాలకు పటిష్టమైన పోలీస్‌ బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. ఐదు వేల మంది వివిధ స్థాయి పోలీస్‌ అధికారులు విధులను నిర్వర్తిస్తారన్నారు. 12 వాహనాల పార్కింగ్‌ ప్రదేశాలను ఏర్పాట్లు చేశామన్నారు. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ట్రాఫిక్‌ను నియంత్రిస్తామన్నారు. నిరంతర పర్యవేక్షణకు 400 సిసి కెమెరాలను ఏర్పాటు చేశామని, మోడల్‌ గేస్ట్‌ హౌస్‌ వద్ద కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ను ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తున్నామని నగర పోలీస్‌ కమీషనర్‌ అన్నారు. ఆలయ ఇవో భ్రమరాంభ మాట్లాడుతూ దసరా ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేసి సిద్దంగా ఉన్నామని అన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *