Breaking News

వైద్య ఆరోగ్య రంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం… : మంత్రి విడదల రజని

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
వైద్య ఆరోగ్య రంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టి నిరుపేదలకు మెరుగైన వైద్యాన్ని అందిస్తున్నామని రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమం, వైద్య విద్య శాఖ మంత్రి విడదల రజని అన్నారు. నగరంలోని 32వ డివిజన్‌ అయోద్యనగర్‌లో డా. వైఎస్‌ఆర్‌ పట్టణ ఆరోగ్య కేంద్రాన్ని శనివారం మంత్రి విడదల రజిని, స్థానిక శాసనసభ్యులు మల్లాదివిష్ణువర్థన్‌తో కలిసి ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో వైద్య ఆరోగ్య రంగానికి పెద్దపీఠ వేస్తున్నామన్నారు. ప్రాధామిక ఆరోగ్య కేంద్రాలు, పట్టణ ఆరోగ్య కేంద్రాలను నాడు `నేడు కార్యక్రమం ద్వారా ఆధునీకరించామన్నారు. పట్టణ ప్రాంతాలలో ప్రతీ 30 వేల జనభాకు ఆరోగ్య కేంద్రం అందుబాటులో ఉంచి వైద్య సేవలు అందిస్తున్నామన్నారు. ఈ కేంద్రాలలో 64 వైద్య పరీక్షలు, 172 రకాల మందులను అందుబాటులో ఉంచుతున్నామన్నారు. ఈ కేంద్రాలలో నెలకు కనీసం 10 కాన్పులు జరిగేలా వైద్య శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 670 కోట్ల రూపాయల నిధులతో 1,125 ప్రాధామిక ఆరోగ్య కేంద్రాలు, 399 కోట్ల రూపాయల నిధులతో అర్భన్‌ ప్రైమరీ హెల్త్‌ సెంటర్స్‌ను, 1,692 కోట్ల రూపాయల నిధులతో 10,032 డా. వైఎస్సార్‌ విలేజ్‌ కినిక్‌లు ప్రతీ గ్రామంలోను ఉండేలా ఏర్పాటు చేశామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 8 వేల కోట్ల రూపాయల నిధులతో 17 మెడికల్‌ కళాశాలలు అందుబాటులోకి రానున్నాయన్నారు. నాడు `నేడు కార్యక్రమం ద్వారా కార్పొరేట్‌ స్థాయి వైద్య సేవాల అంధునీకరణకు 16,255 కోట్ల రూపాయల నిధులను ఖర్చు చేస్తున్నామన్నారు. ప్రతీ ఏటా బట్జెట్‌లో 13 వేల కోట్ల రూపాయలు కేటాయిస్తున్నామన్నారు. వైఎస్సాఆర్‌ ఆరోగ్య శ్రీ పథకం ద్వారా ప్రస్తుతం అందించే చికిత్సలకు అదనంగ కలిపి 3 వేల వరకు చికిత్సలు అందుబాటులోకి తీసుకువచ్చేలా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి అన్నారు.
రాష్ట్ర ప్లానిగ్‌బోర్డు ఉపాద్యాక్షులు, స్థానిక శాసనసభ్యులు మల్లాదివిష్ణువర్థన్‌ మాట్లాడుతూ నియోజకవర్గ పరిధిలో 4 ప్రాంతాలలో అర్భన్‌ ప్రైమరీ హెల్త్‌ సెంటర్స్‌ ఉన్నాయని అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో గుండె ఆపరేషన్‌లు చేసే స్థాయికి మనం చేరుకున్నామన్నారు. రాజీవ్‌నగర్‌ ఆసుపత్రిలో అదనపు పడకలను ఏర్పాటు చేసి 50 పడకల ఆసుపత్రిగా అప్‌గ్రేడ్‌ చేయాలని శాసనసభ్యులు మంత్రికి విజ్ఞప్తి చేశారు.
జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు మాట్లాడుతూ పట్టణ ఆరోగ్య కేంద్రాలలో అందిస్తున్న వైద్య సేవలను ప్రతీ ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. గ్రామీణ ప్రాంతాలలో రూరల్‌ హెల్త్‌ సెంటర్స్‌ నిర్మాణాని డిసెంబర్‌ నాటికి పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. 239 రూరల్‌ హెల్త్‌ సెంటర్స్‌ ఏర్పాటు లక్ష్యాలకు గాను 56 హెల్త్‌ సెంటర్ల నిర్మాణం పూర్తి చేశామని మరో 40 కేంద్రాలు ఫినిషింగ్‌ స్థాయిలోను మరో 100 రూప్‌ స్థాయిలోను ఉన్నాయని కలెక్టర్‌ అన్నారు.
ప్రారంభోత్సవ కార్యక్రమంలో నగర మేయర్‌ రాయన భాగ్యలక్ష్మి, మున్సిపల్‌ కమీషనర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుడ్కర్‌, డిప్యూటి మేయర్‌ అవుతు శ్రీ శైలజారెడ్డి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిణి డా. యం సుహాసిని, స్థానిక నాయకులు ఉన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *