Breaking News

ఆంధ్రప్రదేశ్ ఆల్ బ్యాంక్స్ గోల్డ్ అప్రైజర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ సమావేశం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
ఆంధ్రప్రదేశ్ ఆల్ బ్యాంక్స్ గోల్డ్ అప్రైజర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ విజయవాడ వన్ టౌన్ లో కామాక్షి విశ్వ బ్రాహ్మణ కళ్యాణ మండపంలో శనివారం రాష్ట్ర కమిటీ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈదరాడ శ్రీనివాస్ మాట్లాడుతూ గోల్డ్ అప్రైజర్స్ గా రాష్ట్రంలోని అన్ని బ్యాంకులు లలొ మేము పనిచేస్తున్నామని మాకు జాబు సెక్యూరిటీ లేదని పి.ఎఫ్,ఈఎస్ఐ సౌకర్యాలు కల్పించాలని బ్యాంక్ ఐ.డి కార్డ్స్ తప్పనిసరిగా ఇవ్వాలని అన్ని బ్యాంకులలో సమాన కమిషన్ ఇవ్వాలని ,ఎంక్వైరీ కమిటీ ఏర్పాటు చేసి మా సమస్య లను పరిష్కారం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్ర అధ్యక్షులు వైయస్ ప్రకాష్ ఆచారి మాట్లాడుతూ మేము ఒక చోట నుండి ఒక చోటకు బ్యాంకు పనిమీదవెళ్ళుటకు కన్వీనియన్స్ చార్జెస్ పెంచాలని ,నిపుణులైన అప్రైజర్స్ నియమించాలని, బ్యాంకులకు కానీ కస్టమర్లు కానీ మోసాలు జరగకుండా చూడాలని ఆయన కోరారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో పదాల రమణ వర్కింగ్ ప్రెసిడెంట్ రమేష్, వర్కింగ్ ప్రెసిడెంట్ అయినప్పుడు నాగ పద్మ , ట్రెజరర్ కె.రమేష్, యూనియన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *