Breaking News

ఆంధ్ర ప్రదేశ్ కు నూతన సిమెంట్ మిక్స్ సాంకేతికత


-లైం స్టోన్ కాల్సిన్డ్ క్లే సిమెంట్ సాంకేతికత అందించేందుకు ముందుకొచ్చిన స్విస్ ఏజెన్సీ ఫర్ డెవలప్మెంట్ అండ్ కో-ఆపరేషన్
-సిమెంట్ తయారీలో ఎల్సి-3 మిక్స్ వాడటం వల్ల 40 శాతం తగ్గనున్న కాలుష్యం , 20 శాతం తగ్గనున్న ఇంధనం
-సాధారణ సిమెంట్ తో పోలిస్తే ఎల్సి 3 లాభదాయకం
-పాట్ స్కిం అమలు చేస్తున్న సిమెంట్ పరిశ్రమల్లో 0.35 ఎంటీఓఈ ఇంధనం ఆదా
-పర్యావరణ పరిరక్షణ , ఇంధన సామర్థ్యం పై ముఖ్య మంత్రి , ఇంధన శాఖ మంత్రి ప్రత్యేక దృష్టి
– కె విజయానంద్ , ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి
-పరిశ్రమల శాఖ సహకారంతో ఎల్సి 3 టెక్నాలజీ గురించి సిమెంట్ పరిశ్రమల దృష్టికి తీసుకు వెళతాం.

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వాతావరణ కాలుష్యాన్ని తగ్గించడం , ఇంధనాన్ని పొదుపు చేయగలిగే సామర్థ్యం గల కొత్త రకం సిమెంట్ మిక్స్ సాంకేతికతను ఆంధ్ర ప్రదేశ్ కు అందించేందుకు స్విస్ ఏజెన్సీ ఫర్ డెవలప్మెంట్ అండ్ కో-ఆపరేషన్ (ఎస్డీసి ) ముందుకొచ్చింది. లైం స్టోన్ కాల్సిన్డ్ క్లే సిమెంట్ ( ఎల్సి 3 ) అనే ఈ నూతన సాంకేతికత పరిశ్రమలకు లాభదాయకమే గాక భవిష్యత్ లో సిమెంట్ పరిశ్రమ రంగంలో కీలక పాత్ర పోషించనుంది.
ఎస్డీసి , ఐఐటీ మద్రాస్ సంయుక్తంగా నిర్వహించిన సమావేశానికి రాష్ట్ర ఇంధన శాఖకు చెందిన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఇంధన పరిరక్షణ మిషన్ (ఏపీఎస్ఈసిఎం)ను ఎస్డీసి ప్రత్యేకంగా ఆహ్వానించటం గమనార్హం. ఈ సందర్భంగా జోనాథన్ డెమింగే , హెడ్ కో-ఆపరేషన్ , డెవలప్మెంట్ , ఎంబసీ ఆఫ్ స్విట్జర్లాండ్ , మాట్లాడుతూ దేశంలో భవన నిర్మాణ రంగం అత్యంత వేగంగా విస్తరిస్తున్నదని, దీనివల్ల సిమెంట్ కు డిమాండ్ నానాటికి పెరిగిపోతున్నదన్నారు. సిమెంట్ తయారీ రంగంలో భారత దేశం ప్రపంచంలోనే రెండో స్థానంలో ఉందన్నారు. అయితే సిమెంట్ తయారీలో క్లింకర్ అనే ముడి పదార్ధాన్ని ఎక్కువ శాతంలో ఉపయోగించటం వల్ల వాతావరణ కాలుష్యానికి దారితీస్తుందన్నారు.
సాధారణంగా సిమెంట్ తయారీలో ఉపయోగించే ముడిపదార్దాలలో 95 శాతం క్లింకర్, 5 శాతం జిప్సం వాడతారన్నారు. అయితే స్విస్ డెవలప్మెంట్ ఏజెన్సీ ప్రతిపాదిస్తున్న లైం స్టోన్ కాల్సిన్డ్ క్లే సిమెంట్ అనే సిమెంట్ మిక్స్ ను వాడటం వల్ల కార్బన్ ఉద్గారాలను 40 శాతం తగ్గించగలుతామని, అలాగే 20 శాతం ఇంధనాన్ని ఆదా చేయగలుగుతామని ఆయన పేర్కొన్నారు. సిమెంట్ తయారీలో ఉపయోగించే సున్నపురాయితో ఎల్సి 3 ని కలపడం వల్ల వాతావరణ కాలుష్యానికి దారితీస్తున్న క్లింకర్ అనే ముడి పదార్ధం వినియోగాన్ని పెద్ద ఎత్తున తగ్గించవచ్చునన్నారు.
అంతేకాకుండా ఎల్సి 3 ముడి పదార్ధం స్థానికంగా లభించినట్లైతే సిమెంట్ పరిశ్రమలకు ఇది అత్యంత లాభదాయకమవుతుందని పేర్కొన్నారు. ఈ నూతన సిమెంట్ మిక్స్ వినియోగించడం వల్ల పరిశ్రమలు పెద్దగా సాంకేతిక మార్పులు చేయవలసిన అవసరం పెద్దగా ఉండదని తెలిపారు. అలాగే ఎల్సీ 3 సిమెంట్ మిక్స్ ఉపయోగించి తాయారు చేసే కాంక్రీట్ సాధారణ సిమెంట్ తో పోలిస్తే మరింత నాణ్యతతో కూడి ఉంటుందన్నారు .
భారత్ దేశం 2070 నాటికి కాలుష్య రహితం కావాలని కేంద్ర ప్రభుత్వ లక్ష్యానికి ఈ నూతన సిమెంట్ మిక్స్ టెక్నాలజీ కొంత మేర దోహద పడుతుందని పేర్కొన్నారు . ఇంధన సామర్థ్యం , ఇంధనం పరిరక్షణ లో క్రియాశీలక పాత్ర పోషిస్తున్న ఆంధ్ర ప్రదేశ్ వంటి రాష్ట్రాలు ఈ నూతన సాంకేతికత పై ప్రత్యేకంగా దృష్టి సారించి సిమెంట్ పరిశ్రమలతో అవగాహనా కార్యక్రమాలు నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు .
రాష్ట్ర ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ సందేశాన్ని రాష్ట్ర ఇంధన పరిరక్షణ సంస్థ ఏపీఎస్ఈసిఎం సిఈఓ , ఏ చంద్ర శేఖర రెడ్డి ఈ సమావేశంలో చదివి వినిపించారు. పరిశ్రమల రంగంలో ఇంధన సామర్ధ్యాన్ని పెంపొందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటున్నట్లు విజయానంద్ తన సందేశంలో పేర్కొన్నారు. దీనివల్ల ఇంధన పొదుపు ,ఇంధన భద్రత సాధించడమే కాకుండా పర్యావరణ పరిరక్షణకు విశేషంగా దోహద పడుతుందన్నారు .
ఇందుకోసం పరిశ్రమల్లో పెర్ఫర్మ్ , అచీవ్, ట్రేడ్ స్కింను విజయవంతంగా అమలు చేస్తున్నట్లు తెలిపారు. పాట్ పథకం కింద రాష్ట్రంలో ఇప్పటి వరకు 36 భారీ పరిశ్రమల్లో పాట్ పథకం అమలవుతుండగా, వాటిలో 20 సిమెంట్ ఇండస్ట్రీలని తెలిపారు. సిమెంట్ పరిశ్రమల్లో చేపట్టిన ఇంధన సామర్ధ్య చర్యల వల్ల 0. 35 మిలియన్ టన్ ఆఫ్ ఆయిల్ ఈక్వివలెంట్ (4070 మిలియన్ యూనిట్ల విద్యుత్య్, రూ 2400 కోట్ల విలువైన ఇంధనాన్ని) ఆదా చేయడం జరిగిందన్నారు . అలాగే కార్బన్ ఉద్గారాలు 1.05 మిలియన్ టన్నుల కార్బన్ ఉద్గారాలను తగ్గించడం జరిగిందన్నారు.
రాష్ట్రంలో పాట్ స్కిం పరిధిలోకి వచ్చే 36 (అన్ని సెక్టార్లకు చెందిన) పరిశ్రమలో 0. 818 ఎం టీ ఓ ఈ ఇంధనాన్ని ఆదా చేయటం జరిగిందని , దీని విలువ రూ 5709 కోట్లు అని తెలిపారు.
రాష్ట్రంలో పర్యావరణ పరిరక్షణ, ఇంధన సామర్థ్యం, ఇంధన భద్రత అమలు పై ముఖ్య మంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి , ఇంధన శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి ప్రత్యేక దృష్టి పెట్టారని తెలిపారు. రాష్ట్రంలో అన్ని రంగాల్లో ఇంధన సామర్ధ్యాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. ప్రభుత్వ శాఖల్లో ఇంధన సామర్ధ్య విభాగాలను , ఎనర్జీ కన్సర్వేషన్ బిల్డింగ్ కోడ్ అమలుకు ప్రభుత్వం ఇప్పటికే జీ ఓ లు జారీ చేసిందన్నారు.
ఎస్డీసి ప్రతిపాదించిన నూతన సిమెంట్ మిక్స్ సాంకేతికతను గురించి రాష్ట్రం దృష్టికి తీసుకెళ్తామన్నారు. పరిశ్రమల శాఖ సహకారంతో ఈ అంశాన్ని సిమెంట్ పరిశ్రమల దృష్టికి కూడా తీసుకెళతామని తెలిపారు. పర్యావరణ పరిరక్షణకు దోహదపడే అంశాలకు రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు సంపూర్ణ సహకారం అందిస్తుందన్నారు. ఎల్సి 3 కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ను ఆహ్వానించినందుకు కృతజ్ఞతలు తెలిపారు.
ఇండో స్విస్ బీప్ ద్వారా ఆంధ్ర ప్రదేశ్ గృహ నిర్ల్మాన పథకంలో ఇంటి లోపలి ఉష్ణోగ్రతలు తగ్గించే సాంకేతికతను కొన్ని రోజుల ముందే ప్రవేశపెట్టగా, ఇపుడు సిమెంట్ పరిశ్రమలకు ఎల్సి 3 సాంకేతికత ను అందించేందుకు స్విస్ ఏజెన్సీ ముందుకొచ్చింది.
ఎల్సి 3 కార్యక్రమంలో ఐ ఐ టీ మద్రాస్ కు చెందిన ప్రొఫెసర్ మను సంతానం , ప్రొఫెసర్ రవీంద్ర గెట్టు అలాగే మరియానా కానట్, డాక్టర్ సౌమెన్ మైటీ (తార సంస్థ ), సిమెంట్ తయారీదారుల, ప్రతినిధులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *