
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
“రెండక్షరాల ప్రేమ” చిత్ర షూటింగ్ ను గురువారం గాంధీనగర్ లోని ప్రెస్ క్లబ్ నందు ముహూర్తపు తొలి షూట్ (సన్నివేసం) ను క్లాప్ కొట్టి ప్రారంభించారు. రెండక్షరాల ప్రేమ పూజా కార్యక్రమంలో మెగా మూవి అసోసియేషన్ ప్రెసిడెంట్ యన్.యస్ నాయుడు కెమెరా స్విచ్ ఆన్ చేయగా గౌరవ దర్శకత్వం చింతామణి సొంత మొగుడు సినిమా దర్శక నిర్మాత వీరెళ్ళ నాగేశ్వరరావు వహించారు. ముఖ్య అతిధులుగా మాజీ కార్పొరేటర్ నత్తా నాగేశ్వరరావు,సినీ లిరిక్ రైటర్ ప్రసాదరావు లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత వి. బలరామకృష్ణ నాయకర్ మాట్లాడుతూ ఈ చిత్రంలో ఫ్యాక్షన్, యాక్షన్, ప్రేమ, కామెడీ, డ్రామా ఉంటాయని చెప్పారు. విభిన్న నటులతో కుటుంబ విలువలతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నామని చెప్పారు. మొత్తం సినిమాను రాష్ట్రంలోనే చిత్రీకరిస్తామని వివరించారు. తనకు ఇది రెండో చిత్రమని, దివ్యాంగుడైన తాను సమాజానికి మంచి చేయాలనే ఉద్దేశంతో మంచి చిత్రాలు నిర్మిస్తున్నట్లు తెలిపారు. దర్శకుడు జిన్ని జాన్ అబ్బూరి మాట్లాడుతూ కుటుంబం చూసేలా యువతరం కు చక్కటి సందేశాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నామని చెప్పారు.ఈ చిత్రాన్ని 45 రోజుల్లో శరవేగంగా నిర్మిస్తామని తమ చిత్రంలో 50శాతం నూతన నటీనటులకు అవకాశం కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ సమావేశంలో చిత్ర నటులు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News