రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో 2022-23 ఖరీఫ్‌లో సాగు చేసిన వరి ధాన్యాన్ని నవంబర్ మొదటి వారం నుంచి కొనుగోలు చేసేందుకు ఏర్పాట్లు చేయాలని వ్యవసాయ, పౌరసరఫరాల శాఖల అధికారులను రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ జి. వీరపాండ్యన్ స్పష్టం చేశారు. బుధవారం రాత్రి స్థానిక ఆర్డీవో కార్యాలయంలో 2022-23 ఖరీఫ్ సీజన్లో జిల్లాలో రైతుల నుంచి ధాన్యం సేకరణ, తదితర అంశాలపై పౌర సరఫరాలు, అనుబంధ శాఖలతో మేనేజింగ్ డైరెక్టర్ సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ డా కె. మాధవీలత, జాయింట్ కలెక్టర్ సిహెచ్. శ్రీధర్ లు మర్యాద పూర్వకంగా కలిసి పుష్ప గుచ్చెం అందచేశారు. ఈ సందర్భంగా ఏం డి వీరపాండ్యన్ మాట్లాడుతూ, రైతు భరోసా కేంద్రాలు (RBKS) ద్వారా రైతులు తమ ఉత్పత్తులను సరైన సమయంలో విక్రయించి మంచి ధర కోసం రైతులకు పూర్తి స్థాయి లో అవగాహన కల్పించాలన్నారు. రాష్ట్రంలో వరి పుష్కలంగా ఉత్పత్తి అవుతున్న నేపథ్యంలో, బియ్యం ఎగుమతి చేసే మార్గాలను అధికారులు అన్వేషించాలని, విరిగిన మరియు రంగు మారిన వరి నుండి ఆదాయ వనరుగా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించడం జరిగిందన్నారు. జిల్లా లో ఈ క్రాప్ ద్వారా నమోదైన పంటను కొనుగోలుకు సంబంధించి ముందస్తుగా కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసుకొని అమలు చేయాలని ఆదేశించారు.
జిల్లాలో దిగుబడి, సాగు విస్తీర్ణం కు అనుగుణంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని కలెక్టర్ మాధవీలత వివరించారు. ప్రతి కేంద్రంలో తేమ మీటర్, ఎనాలిసిస్ కిట్, పొట్టు తొలగించే యంత్రం, తదితర ఉపకరణాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. జిల్లాలో 2022 ఖరీఫ్ సీజన్లో 4.53 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యంగా అంచనా వెయ్యడం జరిగిందని, అందుకు అనుగుణంగా క్షేత్ర స్థాయి కార్యాచరణ అమలు చేస్తున్నట్లు జాయింట్ కలెక్టర్ సిహెచ్. శ్రీధర్ పేర్కొన్నారు. జిల్లాలో 80 లక్షల గన్ని బ్యాగులను సిద్దం చేసుకోవడం, అర్భికే లకు అనుసంధానంగా తూకం కేంద్రాలను గుర్తించి మ్యాపింగ్ చేశామన్నారు. జిల్లాలో 239 అర్భికలకు 143 మిల్లులు మ్యాపింగ్ చేశామన్నారు. జిల్లాలో 5 ఏం ఎస్ ఎల్ పాయింట్ సగటున రోజుకు 7,800 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ కి, కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేశామన్నారు. సంబందించిన శాఖల అధికారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News