Breaking News

ఈ నెల 28, 29 తేదీలలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కాపు సంక్షేమ మరియు అభివృద్ది సంస్థ తాడేపల్లి నందు కౌన్సెలింగ్…

-జగనన్న విదేశీ విధ్యా దీవెన పథకము కొరకు ధరఖాస్తు చేసియున్న విద్యార్దులకు ఈ నెల 28, 29 తేదీలలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కాపు సంక్షేమ మరియు అభివృద్ది సంస్థ తాడేపల్లి నందు కౌన్సెలింగ్

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రరాష్ట్రము లోని ఆర్ధికముగా మరియు సామాజికముగా వెనుకబడిన కాపు, తెలగ, బలిజ మరియు ఒంటరి కుటుంబాలలో విదేశీ విధ్యను ఆశించే విద్యార్దిని, విద్యార్దుల కొరకు “జగనన్న విదేశీ విధ్యా దీవెన పథకం” ప్రారంభించడం జరిగినిది. ఈ పథకం లో నిర్ణీత ప్రక్రియ ద్వారా ఎంపిక చేయబడిన అభ్యర్ధులకు యూనివర్సిటీ ఫీజు ను బట్టి రూ.50,00,000/-లక్షలు వరకు ఆర్దిక సహాయము అందించబడతుంది. 2022-23 సంవత్సరానికి అభ్యర్ధుల ఎంపిక కార్యక్రము అక్టోబర్, 28 మరియు 29 తేదీలలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కాపు సంక్షేమ మరియు అభివృద్ది సంస్థ, పొత్తూరి మర్కంటైల్, డోర్ నెం: 12-467, 2వ మరియు 3వ అంతస్తు, బైపాస్ రోడ్డు, ఎన్ హెచ -16, అప్ స్టయిర్ ట్రయిఉంఫ్ బైక్ షోరూం, రెవెన్యూ వార్డ్ -12, తాడేపల్లి – 522501. నందు ఉదయం 10:00 గంటలకు ఏర్పాటు చేయడమైనది. “జగనన్న విదేశీ విధ్యా దీవెన పథకం” ఆర్ధిక సహాయం కోరకు ధరఖాస్తు చేసికున విద్యార్దిని విద్యార్ధులు తమ తమ విద్యార్హతలు మొదలగు సర్టిఫికేట్లతో (ఒరిజినల్ మరియు అటెస్టెడ్ చేయబడిన జిరాక్స్ కాపీలతో) హాజరు కావాలసినిదిగా కోరడమైనది. ఇంకనూ తెలియచేయినది ఏమనుగా 28 వ తారికున ఇండియాలో ఉన్న విద్యాదులకు మరియు 29 వ తారికున ఆగస్టు నెల 2022 తరువాత విదేశాలకు వెళ్ళన విద్యార్దుల యొక్క తల్లి/తండ్రులు పైన తెలిపిన అడ్రసు కు సర్టిఫికేట్ల నకళ్ళు తో హాజరుకావాలను. సదరు విదేశాలలో ఉన్న విద్యార్దులకు ఆన్ లైన్ ద్వారా కౌన్సెలింగ్ నిర్వహించి, ప్రభుత్వ ఉత్తర్వులు మేరకు చర్యలు తేసికొనబడునని తెలియజేయడమేనది. సందేహలు మరియు వివరముల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నెం: 63051 59559, & 63054 48393.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *