Breaking News

రీ సర్వే లో చిన్న పాటి తప్పులు లేని రికార్డు లు తయారు కావాలి : జె.సి

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న వై.ఎస్.ఆర్ జగనన్న భూ హక్కు మరియు భూ రక్ష పథకం ద్వారా రీసర్వే రికార్డ్ లలో చిన్న పాటి తప్పులు కూడా లేకుండా చూడాలని జాయింట్ కలెక్టర్ డి.కె బాలాజి ఆదేశించారు. మంగళవారం ఉదయం స్థానిక ఎస్.వి యునివర్సిటీ సెనేట్ హాల్ నందు జిల్లాలో రీ సర్వే నిర్వహిస్తున్నసంబందిత మండల తహసిల్దర్లతో, సర్వేయర్లతో వి ఆర్ ఓ లతో జె.సి సమావేశమై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా రికార్డు లలో ఉన్న తప్పులను సరిచేసే విధానాన్ని వివరించి, సందేహాలను నివృత్తి చేసారు. జె.సి మాట్లాడుతూ జిల్లాలో 64 గ్రామాలలో రీ సర్వే నిర్వహించామని, ఫైనల్ ఆర్ .ఓ.ఆర్ 61 గ్రామాలలో పూర్తి చేసామని అన్నారు. వీటికి సంబంధించి పట్టా దారుల పేర్లలో అక్షర పొరబాట్లను సరిదిద్దవచ్చని, కాని పూర్తి గా పేరును మార్చడానికి వీలు లేదని అన్నారు. వెబ్ ల్యాండ్ మేరకు రికార్డ్ లను సరిచూసుకోవాలని, రీ సర్వే జరిగిన గ్రామాలలో ఆన్ లైన్ నందు సరిదిద్దే విధానం లేని వాటిని నిర్దేశించిన ప్రోఫర్మా ద్వారా వెంటనే తెలియజేయాలని సూచించారు. భూ రికార్డులను మనం వంద సంవత్సరాల తరువాత రీ సర్వే నిర్వహిస్తునమని ఈ రీ సర్వే లో ఖచ్చితమైన భూ రికార్డులు రైతులకు అందుతాయని అందుకే మనం జాగ్రత్త వహించి వెబ్ ల్యాండ్ లో ఓపెన్ అయిన ఎడిట్ ఆప్షన్ ద్వారా మరోమారు రికార్డులను సరిదిద్దే అవకాశం కలిగిందని అన్నారు. త్వరలో అందించనున్న పట్టాదారు పాసు పుస్తకాలలో మీరు రీ వెరిఫికేషన్ తరువాత అందించే ఫైనల్ డ్రాఫ్ట్ ల్యాండ్ రికార్డ్స్ మేరకు నమోదవుతుందని అన్నారు. సమావేశంలో తహసీల్దార్లు, సర్వేయర్లు అడిగిన సందేహాలను జె.సి, డి.ఆర్.ఓ శ్రీనివాస రావు నివృత్తి చేసారు. ఈ కార్యక్రమంలో రీ సర్వే నిర్వహించిన డక్కిలి(6 గ్రామాలు), నాగలాపురం(2), పిచ్చాటూరు(2), ఓజిలి(1), నాయుడు పేట(3), పెళ్లకూరు(3), దొరవారిసత్రం(3), సూళ్ళూరుపేట(5), తడ(4), చంద్రగిరి(1), వేంకటగిరి(2), బాలాయపల్లి(2), చిట్టమూరు(8), వాకాడు(8), కోట(2), చిల్లకూరు(6), గూడూరు (4) మండలాలలో 61 గ్రామాలలో రీ సర్వే నిర్వహంచిన తహసిల్దార్లు, సర్వేయర్లు, వి.ఆర్.ఓ లు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *