-జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వివిధ రంగాలలో విశిష్ట సేవలందించిన ప్రముఖులకు నవంబర్ 1వ తేదిన రాష్ట్ర ప్రభుత్వం అందించనున్న వైయస్సార్ లైఫ్ టైం ఎచీవ్‌మెంట్, వైయస్సార్ ఎచీవ్‌మెంట్ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లను పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు తెలిపారు. వైయస్సార్ లైఫ్ టైం ఎచీవ్‌మెంట్, వైయస్సార్ ఎచీవ్‌మెంట్ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమ నిర్వహణపై జిల్లా కలెక్టర్ డిల్లీరావు ఆయన కార్యాలయంలో మంగళవారం జాయింట్ కలెక్టర్ ఎస్ నుపూర్ అజయ్, సబ్ కలెక్టర్ అదితి సింగ్, డిఆర్‌వో కె. మోహన్‌కుమార్‌లతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నవంబర్ 1న రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజున ప్రభుత్వం వివిధ రంగాలలో విశిష్ట సేవలందించిన ప్రముఖులకు వైయస్సార్ లైఫ్ టైం ఎచీవ్‌మెంట్, వైయస్సార్ ఎచీవ్‌మెంట్ అవార్డులను ప్రధానం చేయాలని నిర్ణయించడం జరిగిందన్నారు. ఈ ఏడాది 30 మంది ప్రముఖులకు అవార్డులను ప్రధానం చేయనున్నారన్నారు. అవార్డుల ప్రధానోత్సవానికి విజయవాడలోని ఎ కన్వెన్‌షన్ హాల్‌ను ఖరారు చేయడం జరిగిందన్నారు. అవార్డ్ గ్రహీతలు ఆయా జిల్లాలకు చెందిన స్థానిక లైజినింగ్ అధికారితో కలిసి అవార్డ్ గ్రహితలు వారికి కేటాయించిన నోవాటల్ హోటల్‌లో బస చేసేందుకు రానున్నారన్నారు. వారికి ఆహ్వానం పలికి వెన్నెంటె ఉండి ప్రభుత్వం ఏర్పాటు చేసిన వాహనంలో వేదికకు తీసుకువచ్చేందుకు స్థానిక లైజినింగ్ అధికారులను నియమించాలని జిల్లా కలెక్టర్ సూచించారు. లైజినింగ్ అధికారులు అవార్డీలకు కేటాయించిన సీట్లలో ఆశీనులయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్ర మంత్రులు , శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, పార్లమెంట్ సభ్యులు, కార్పొరేషన్ చైర్మన్లు, ప్రభుత్వ సలహదారులు కార్యక్రమానికి హాజరు కానున్నారని వారిని ప్రోటోకాల్ ప్రకారం ఏర్పాటు చేసిన ప్రత్యేక సీట్లలో ఆశీనులైయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. వైయస్సార్ లైఫ్ టైం ఎచీవ్‌మెంట్, వైయస్సార్ ఎచీవ్‌మెంట్ అవార్డుల విశిష్టతను తెలుపుతు ముద్రించిన బుక్‌లెట్‌లను పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ముఖ్యంగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత విశేషాలపై చాయాచిత్ర ప్రదర్శన ఏర్పాటు చేయడం జరుగుతుందని ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చేసేలా చర్యలు తీసుకోవాలని సభ వేదికను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డిల్లీరావు తెలిపారు.
Prajavartha Online Telugu News