Breaking News

ఆధార్‌ కార్డులో మార్పులు చేర్పుల ప్రక్రియను ఎప్పటికప్పుడు పూర్తి చేసి ప్రజలకు సేవలందించాలి…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఎన్‌రోల్‌మెంట్‌ కిట్ల ద్వారా ఆధార్‌ కార్డులో మార్పులు చేర్పుల ప్రక్రియను ఎప్పటికప్పుడు పూర్తి చేసి ప్రజలకు సేవలందించాలని జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు సచివాలయ సిబ్బందికి సూచించారు. ఆధార్‌ కార్డు మార్పు చేర్పుల ప్రక్రియను జిల్లా కలెక్టర్‌ డిల్లీరావు మంగళవారం కుమ్మరిపాలెం 119 సచివాలయంలో పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఆధార్‌ కార్డులో మార్పు చేర్పులను చేసుకునేందుకు గతంలో ప్రజలు పోస్టాఫీసు, కార్వే సెంటర్‌ మీ`సేవా కేంద్రాలకు వెళ్లవలసి వచ్చేదన్నారు.దీని వలన దూరప్రాంతాల నుండి ప్రజలు వ్యయ ప్రయాసలతో పాటు సమయాన్ని వృదా చేసుకోవాల్సి వచ్చేదన్నారు. సచివాలయాలలో ఆధార్‌ కార్డు నందు మార్పులు చేర్పుల ప్రక్రియను అందుబాటులోకి తీసుకువచ్చే ప్రక్రియను సులభతరం చేయడం జరిగిందన్నారు. జిల్లా వ్యాప్తంగా 65 సచివాలయాలలో ఆధార్‌ ఎన్‌రోల్‌మెంట్‌ కిట్లను ఏర్పాటు చేయడం ద్వారా ఆధార్‌ కార్డులో మార్పులు చేర్పుల ప్రక్రియను నిర్వహిస్తున్నామన్నారు. విజయవాడ నగరంలో 25 సచివాలయాలు, విజయవాడ రూరల్‌ మండలంలో 4 సచివాలయాలలోను మండలానికి రెండు సచివాలయాలలో ఆధార్‌ ఎన్‌రోల్‌మెంట్‌ కిట్లను ఏర్పాటు చేసి ప్రజలకు ఆధార్‌లో పేరు మార్పుల ప్రక్రియను సులభతరం చేశామన్నారు. ఆధార్‌ కార్డు మార్పు చేర్పుల కొరకు సచివాలయానికి వచ్చే ప్రజలకు సచివాలయ సిబ్బంది అవసరమైన సేవలు అందించి ప్రక్రియను సకాలంలో పూర్తి చేసి ప్రజలకు మెరుగైన సేవలందించాలని సూచించారు. సెప్టెంబర్‌ 21వ తేదీన 119 సచివాలయంలో ఆధార్‌ ప్రక్రియను ప్రారంభించడం జరిగిందని ఇప్పటివరకు 139 మంది ఆధార్‌ కార్డులో మార్పు చేర్పుల ప్రక్రియ పూర్తి చేసుకున్నారని ఇందులో 116 మంది వారి ఆధార్‌ కార్డులను మార్పు చేర్పులు చేసుకున్నారని 15 మంది అన్‌లైన్‌ డేటాతో మార్పు చేర్పుల ప్రక్రియతో పూర్తి చేసుకున్నారని మరో 8 మంది కొత్త ఆధార్‌ కార్డులకు నమోదు చేసుకున్నారని సచివాలయ సబ్బింది జిల్లా కలెక్టర్‌ డిల్లీరావుకు వివరించారు. ఆధార్‌ కార్డులో తన వేలుముద్రలు సక్రమంగా నమోదు కాలేదని తిరిగి నమోదు చేసుకునేందుకు సచివాలయానికి విచ్చేసిన భవాని పురానికి చెందిన సుజాతకు జిల్లా కలెక్టర్‌ డిల్లీరావు స్వయంగా వేలు ముద్ర ప్రక్రియను పూర్తి చేయించారు. ఆధార్‌ కార్డులో అడ్రస్‌ మార్పు కోసం విచ్చేసిన కుమ్మరిపాలెంకు చెందిన అన్వర్‌ ఉన్నీసాను వివరాలు అడిగి తెలుసుకుని అడ్రస్‌ మార్పు ప్రక్రియను పూర్తి చేసేలా చర్యలు తీసుకున్నారు. సచివాలయ సందర్శనలో జిల్లా కలెక్టర్‌ వెంట సబ్‌ కలెక్టర్‌ అదితి సింగ్‌, పశ్చిమ తహాశీల్థార్‌ యం.మాధురి, విఆర్‌వో కె. బేబి, సచివాలయ సిబ్బంది ఉన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *