విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వైసీపీ కార్యకర్త లాగా పనిచేస్తున్నారు తప్పా మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా పని చేయడం లేదని తెలుగు మహిళ పార్లమెంటు అధ్యక్షురాలు చెన్నుపాటి ఉషారాణి , తెలుగు మహిళా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు షేక్ ఆషా లు విమర్శించారు. తెలుగుదేశం నాయకులు కేశినేని శివనాథ్ (చిన్ని) కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలుగు మహిళ పార్లమెంటు అధ్యక్షురాలు చెన్నుపాటి ఉషారాణి , తెలుగు మహిళా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు షేక్ ఆషా లు మాట్లాడుతూ రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలపై దాడులు, దౌర్జన్యాలు, మానభంగాలు జరిగినప్పుడు స్పందించని మహిళా కమిషన్ చైర్ పర్సన్ ప్రతిపక్ష నాయకుల పైన, ఈ ప్రభుత్వ లోపాలను ప్రశ్నించిన పార్టీలపైన నోటీసులు ఇస్తూ పనిచేయటం సిగ్గుచేటని, వాసిరెడ్డి పద్మ ఈ ప్రభుత్వాన్ని, ఎమ్మెల్యేలను, మంత్రులను కాపాడటానికి తప్ప మహిళల రక్షణ కోసం, మహిళల కాపాడటం కోసం ఏమాత్రం పనిచేయడం లేదని, ఇలాంటి మహిళ, చైర్ పర్సన్ కమిషన్ గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, ఉండటం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళలు చేసుకున్న దురదృష్టమని అన్నారు. అసెంబ్లీ సాక్షిగా మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత ప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబు నాయుడు కుటుంబంలోని మహిళల పట్ల అవాకులు చవాకులు మాట్లాడుతూ, వాళ్ల కుటుంబాల్లో ఉన్న మహిళల గౌరవాన్ని కించపరుస్తూ మాట్లాడినప్పుడు, అలాంటి వ్యాఖ్యలు చేసిన మంత్రులకు ఎమ్మెల్యేలకు వాసిరెడ్డి పద్మ ఎందుకు నోటీసులు ఇవ్వలేదని ప్రశ్నించారు. రాష్ట్రంలోని మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా విధులు నిర్వహిస్తూ, ప్రజలు కట్టిన పన్నులతో జీతం తీసుకుంటూ జగన్మోహన్ రెడ్డి కోసం వైసీపీ పార్టీ కోసం పనిచేయటానికి నీకు సిగ్గు ఉందా అని ప్రశ్నించారు. అమరావతి రైతులు కోసం పాదయాత్ర చేస్తున్నప్పుడు పాదయాత్రలో పాల్గొన్న మహిళలపై సీసాలతో, రౌడీలతో సాక్షాత్తు వైసీపీ పార్టీ ఎంపీ దగ్గరుండి మరి మహిళలపై దాడి చేస్తుంటే ఏం చేస్తున్నారు ప్రశ్నించారు. నువ్వు ఎన్ని నోటీసులు ఇచ్చిన, ఎన్ని బెదిరింపులకు పాల్పడిన, కచ్చితంగా వైసీపీ ప్రభుత్వం చేస్తున్న దౌర్జన్యాలను, మహిళలపై జరుగుతున్న దాడులను, ఖండిస్తాం, మహిళల రక్షణ కోసం, మహిళా సమస్యల పరిష్కారం కోసం, తెలుగు మహిళ ముందుండి పోరాడుతుందని తెలియజేశారు. ఈ సమావేశంలో తెలుగు మహిళా పార్లమెంట్ కార్యదర్శి అంకితం ఇందిరా ప్రియదర్శిని, విజయవాడ పార్లమెంట్ తెలుగు మహిళా నాయకురాలు లక్ష్మి, సుబ్బలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News