Breaking News

మోటో వాల్ట్ నూతన 3S సౌకర్యం ఆవిష్కరణ


-మోటో వాల్ట్ నకు భారతదేశం లో ఇది 6వ నూతన డీలరుషిప్ మరియు ఆంధ్రప్రదేశ్ నందు రెండవది
-మోటో వాల్ట్ అనేకమైన ప్రపంచ శ్రేణి బ్రాండ్ల తోపాటు మోటో మోరిని మరియు జోన్ టెస్ వంటివి విక్రయిస్తుంది
-డిసెంబర్ ముగిసే నాటికి కొత్తగా 23 డీలరుషిప్స్ లను బ్రాండ్ ఆవిష్కరించనున్నది

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
మోటారు సైకిల్ ప్రయాణం లో ఒక నూతన అనుభూతిని కలిగించే లక్ష్యం తో ఆదిశ్వర్ ఆటో రైడ్ ఇండియా మరియు మహావీర్ గ్రూపు కంపెనీ ప్రత్యేకమైన మోటో వాల్ట్ షోరూం ను విజయవాడలో నేడు ప్రారంభించారు. మోటో వాల్ట్ ప్రపంచ మార్కెట్ ప్రేరణతో, విభిన్నమైన బ్రాండ్లకు చెందిన వాహనాలను వివిధ రకాల స్వరూపాలతో మరియు ఆకర్షనీయమైన ధరలలో మోటో వాల్ట్ ఖాతాదారులకు అందిస్తుంది.

ఈ అత్యాధునికమైన మోటోవాల్ట్ షోరూం వరుణ్ జబఖ్ సారధ్యం లో విజయవాడలోని డోర్ నెం.4-112, జి.టి.రోడ్, జాతీయ రహదారి-5, ప్రసాదంపాడు వద్ద ఆవిష్కరించారు. వేర్వేరు బ్రాండ్లకు చెందిన విస్త్రుత శ్రేణి సూపర్ బైకులు అన్ని ఒకేచోట అందుబాటులో అందించు సదుపాయంతో మోటో వాల్ట్ ప్రారంభించారు. ఈ షోరూం బైకుల సర్వీసుల తోపాటు మోటారింగ్ నకు అవసరమైన అన్ని రకాల విడిభాగములు, ఉత్పత్తులు మరియు యాక్ససరీస్ అందుబాటులో ఉంచుతుంది.

మోటో వాల్ట్ ప్రారంభోత్సవ సందర్భంగా ఆదిశ్వర్ ఆటో రైడ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ మేనేజింగ్ డైరక్టర్ వికాస్ జబఖ్ మాట్లాడుతూ మోటో వాల్ట్ ను విజయవాడలో ఏర్పాటు చేయటం తమకు ఎంతో సంతోషదాయకం అన్నారు. ఈ షోరూం ద్వారా ప్రపంచ వ్యాప్తంగా నున్న వివిధ బ్రాండ్ల మోటారు సైకిల్స్ ను ఉత్సాహపూరితులకు అందించాలనుకుంటున్నాము మరియు మేము ప్రపంచ వ్యాప్తంగా ఈ విధానం పైన మంచి పట్టు సాదించాము మరియు భారతదేశం లోని మా భాగస్వాములు కూడ ఈ గొప్ప సౌలభ్యతను మరియు ఉత్తమ ఖాతాదారుల సేవలను అందిపుచ్చుకుంటారు. అంతేకాక మా ఖాతాదారులకు ఒక ప్రీమియం కొనుగోలులోయాజమాన్యత అనుభవాన్ని మేము తప్పక కలిగిస్తామని ఆయన చెప్పారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *