విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అమలు చేస్తున్న నవరత్నాలతో రాష్ట్రమంతా సంక్షేమ వెల్లువ కురుస్తోంది అని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ పేర్కొన్నారు. శనివారం గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా 2వ డివిజన్ 25వ సచివాలయ పరిధిలోని రెవిన్యూ కాలని,వాణి పబ్లిక్ స్కూల్ ,కార్మిక నగర్ కండ ప్రాంతాల్లో ఇంటింటికి వెళ్లిన అవినాష్ ప్రభుత్వం ద్వారా వారి కుటుంబాలకు అందుతున్న సంక్షేమ లబ్ది వివరాల కరపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ రాష్ట్ర చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పాలన సాగుతోంది అని, కులమత పార్టీలకతీతంగా అర్హతే ప్రామాణికంగా సంక్షేమ పథకాలు అందజేస్తూ కేవలం మూడేళ్ళ కాలంలోనే 95 శాతం హామీలు అమలు చేసిన ఘనత జగనన్న దే అని అన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం లో నాయకుల అరాచక పాలనకు విసుగు చెంది ఏ నమ్మకంతో అయితే వైస్సార్సీపీ ని ప్రజలు గెలిపించారో ఆ నమ్మకం నిలబెట్టుకునే విధంగా నేడు పాలన అందుతుంది అని ప్రజలు తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు అని, వారి సంపూర్ణ మద్దతు తో మరలా జగన్ ముఖ్యమంత్రి అవ్వడం ఖాయమని అవినాష్ ధీమా వ్యక్తం చేశారు. కొండప్రాంతం అధికంగా ఉన్న ఈ డివిజన్ ను గతంలో ఎవరు పట్టించుకొనే వారు కాదు అని కేవలం వీరిని ఓటు బ్యాంకుగా మాత్రమే చూస్తూ ఎన్నికల సమయంలోనే పలకరించేవారు అని విమర్శించారు. కానీ నేడు వైస్సార్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రత్యేక శ్రద్ధ పెట్టీ మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు నిత్యం అందుబాటులో ఉంటూ వారి సమస్యలను వెనువెంటనే పరిష్కరిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో 2వ డివిజన్ కార్పొరేటర్ అంబడిపూడి నిర్మలా కుమారి వైస్సార్సీపీ నాయకులు రవి ప్రకాష్,చందా కిరణ్,కోటి నాగులు, మెయిన్, చెన్ను, శ్రీను తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News