Breaking News

జర్నలిస్ట్ మిత్రుల ఆధ్వర్యంలో సూపర్ స్టార్ కి ఘన నివాళి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఎందరికో సినీ రంగంలో మార్గదర్శకం గా నిలిచిన ఏకైక వ్యక్తి సూపర్ స్టార్ కృష్ణ అని మంచికి మారుపేరుగా సినీ రంగంలో తారాస్థాయికి ఎదిగిన కృష్ణకి విజయవాడ జర్నలిస్ట్ మిత్రుల ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు. విజయవాడ గాంధీనగర్ ప్రెస్క్లబ్లో బుధవారం ఏర్పాటుచేసిన సంతాప సభలో పలువురు వక్తలు ప్రసంగించారు. ఐజేయు ఉపాధ్యక్షులు అంబటి ఆంజనేయులు, ప్రముఖులు ఎంసీ దాసు మాట్లాడుతూ గెలుపు ఓటములను పక్కనపెట్టి సినీ 350 చిత్రాలకు పైగా హీరోగా నటించిన ఘనత నటశేఖరుడు కృష్ణ కే దక్కిందని వ్యాఖ్యానించారు. గొప్ప మానవతమూర్తి అని కొనియాడారు. చిత్ర రంగంలో విప్లవాత్మక మార్పులకు ఆయనే శ్రీకారం చుట్టారని అన్నారు. దర్శకుడిగా, నిర్మాతగా అనేక చిత్రాలు నిర్మించారు. నటుడిగా కౌబాయ్, జేమ్స్ బాండ్ వంటి ప్రయోగాత్మక చిత్రాలతో తెలుగు సినిమా స్థాయిని పెంచిన గొప్ప నటుడని కీర్తించారు. విప్లమాత్మకమైన చిత్రాలలో నటించి ప్రజా చైతన్యంలో భాగమయ్యారు. ఆయన ఎంత ఎదిగిన వినయం విధేయత ఆయన సొంతంగా చేసుకొని చిత్రరంగంలో చెరగని ముద్రను వేసుకున్న రియల్ హీరో కృష్ణ అని వక్తలు పలువురు కొనియాడారు. ఎంత ఎదిగిన ఒదిగి ఉండటమే ఆయన చూసి నేర్చుకోవాలని పలువురు జర్నలిస్టు నాయకులు ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు నిమ్మరాజు చలపతిరావు, ఏపీడబ్ల్యూజే నాయకులు చావా రవి, కొండ రాజేశ్వరరావు, చందు జనార్ధన్, ఎస్ కే బాబు, ఆర్ వసంత్ వారి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కృష్ణ అభిమానులు జర్నలిస్టులు మహా టీవీ రజాక్ టివి5 దుర్గాసి రవి 10 టీవీ టి కృష్ణ, డెల్టాన్యూస్ గంగరాజు, నేటి పత్రిక ప్రజావార్త కొండూరి శ్రీనివాసరావు, సీనియర్ రిపోర్టర్ పట్టాభి రాంబాబు తదితరులు పాల్గొని కృష్ణ అకాల మరణానికి చింతిస్తూ వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని, సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *