-మంత్రి జోగి రమేష్
కృత్తివెన్ను, నేటి పత్రిక ప్రజావార్త :
సంక్షేమ పథకాలను అమలు చేయడంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం దేశంలోనే అగ్రభాగాన నిలిచి కొత్త చరిత్ర సష్టించిందని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఆయన బుధవారం పెడన నియోజవర్గం కృత్తివెన్ను గ్రామంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు 412 గృహాలను ఏకబిగిన సందర్శించారు.
తొలుత ఆయన గురజ మద్దిరావమ్మ, కానూరు రేవతి, కానూరు రోజా రాణి, జొన్నాల మాధవి, బండారు రామారావు, తోట శ్రీరామ్మూర్తి, తోట నాగమల్లేశ్వరి, తోట వెంకటరమణ, తాడి చినగంగమ్మ, కొక్కిలిగడ్డ వెంకటేశ్వరరావు, అల్లం లక్ష్మి, ఒడుగు వరలక్ష్మి,ఒడుగు నెల బాలుడు బొడ్డు లక్ష్మి బసగాని రాముడు, కొక్కిలిగడ్డ కృష్ణవేణి, తమ్ము మావుళ్ళమ్మ, కొక్కిలిగడ్డ సరోజిని, తమ్ము నాంచారి, నడకుదుటి సావిత్రి తదితరుల ఇంటికి మంత్రి జోగి రమేష్ వెళ్లి ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా పలకరించారు. సంక్షేమ పథకాల అమలు గురించి వారిని అడిగి తెలుసుకుంటూ ముందుకు సాగారు. ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలు మీకు అందుతున్నాయా అని పలువురు లబ్ధిదారులను పేరు పేరున పలకరిస్తూ అడిగి తెలుసుకున్నారు. కృత్తివెన్నులోని తమ ప్రాంతంలో లోవోల్టాజ్ సమస్య ఉందని,రాత్రుళ్ళు వీధి దీపాలు సరిగా వెలగని పరిస్థితి ఉందని తాడి చినగంగమ్మ అనే మహిళ మంత్రి జోగి రమేష్ దృష్టికి తీసుకొచ్చింది. ఈ విషయమై స్పందించిన ఆయన విద్యుత్ శాఖ ఏఈ, డిఈలను అక్కడ పిలిపించి ఈరోజే ఆ సమస్యను ఎట్టి పరిస్థితుల్లోనూ పరిష్కరించాలని ఆదేశించారు.
ఈ సందర్భంగా మంత్రి జోగి రమేష్ మాట్లాడుతూ, పేద ,మధ్య తరగతి కుటుంబాల ఆర్థిక బలోపేతమే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలన దిగ్విజయంగా సాగిస్తున్నారని ,అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ఇచ్చిన హామీలలో 95 శాతం నెరవేర్చి ఇది కేవలం మాటలు సినిమా డైలాగుల ప్రభుత్వం కాదని, ఇచ్చిన మాట నిలబెట్టుకునే చేతల ముఖ్యమంత్రి ప్రజలకు అండగా నిలబడ్డారన్నారు. కేవలం లబ్ధిదారుని అర్హత ప్రామాణికంగా తీసుకొని కుల మత వర్గ పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలను అందరికీ అమలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.ఈ సంక్షేమ పథకాలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయని మంత్రి అన్నారు.
ఈ కార్యక్రమంలో కృత్తివెన్ను సర్పంచ్ పెదసింగు మోకమ్మ శామ్యూల్, కృత్తివెన్ను మండల పార్టీ అధ్యక్షులు వైదాని వెంకట రాజు, కృత్తివెన్ను జడ్పిటిసి మైలా రత్నకుమారి, ఎంపీపీ కూనసాని గరుడా ప్రసాద్, కృత్తివెన్ను ఎంపీటీసీ చింతా వడ్డీకాసులు, మార్కెట్ యార్డ్ చైర్మన్ కొల్లాటి బాలగంగాధర్, కొక్కిలిగడ్డ భాస్కరరావు, కొక్కిలిగడ్డ ఏడుకొండలు, గురజ రాము,లంకా ఏడుకొండలు, చిన గొల్లపాలెం రైతు భరోసా కేంద్రం చైర్మన్ బొల్లా సూరిబాబు, అబ్దుల్ మతిన్, ఉస్మాన్ బాషా, ఆంజనేయులు, ఎంపీడీవో జి. పిచ్చబాబు, డిప్యూటీ తాహసిల్దార్ శశికుమార్, స్థానిక ప్రజా ప్రతినిధులు , వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ,కార్యకర్తలు,వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది, ఏఎన్‌ఎంలు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News