-కలెక్టరు డా. మాధవీలత
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో వై.ఎస్.ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు భూ రక్ష పత్రాల జారీకి పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టరు సంబందిత అధికారులను ఆదేశించారు.
గురువారం సిసిఎల్ఏ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్ అమరావతి నుండి వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష పథకం రీసర్వే పై వీడియో కాన్ఫరెన్సు నిర్వహించగా, స్థానిక జిల్లా కలెక్టరు కార్యాలయ వీసీ హాల్ నుండి కలెక్టరు డా. కే. మాధవీలత, జాయింట్ కలెక్టరు సీహెచ్. శ్రీధర్ పాల్గొన్నారు.
ఈ సందర్బంగా సిసిఎల్ఏ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిజి. సాయిప్రసాద్ మ్యుటేషన్ కరెక్షన్, ట్రాన్సాక్షన్, చుక్కల భూములు, ఇన్కమ్ సర్టిఫికెట్లు, కోర్ట్ కేసులో పురోగతి, తదితర అంశాలపై సమీక్షించారు. రాష్ట్ర వ్యాప్తంగా రీ సర్వే పనులు జరుగుతున్నాయని, రీసర్వే పూర్తయిన గ్రామాలలో భూ హక్కు దారులకు జగనన్న భూ హక్కు భూ రక్ష పత్రాల జారీకి చర్యలు చేపట్టాలని తెలిపారు. భూ హక్కు పత్రాలు ప్రింటింగ్ పనులను లక్ష్యానికి అనుగుణంగా నిర్దేశించుకొని పూర్తి చేయాలన్నారు. భూ హక్కు పత్రాలను మంజూరు చేయబోయే పట్టాదారుల వివరాలను కలెక్టర్లు క్షుణ్ణంగా పరిశీలించాలని తెలియజేసారు. రీ సర్వే ప్రక్రియలో భాగంగా డ్రాఫ్ట్ ఆర్ ఓ ఆర్, 13 నోటిఫికేషన్స్ కు సంబందించిన పనులను నిర్దేశించిన సమయం లోగా పూర్తి కావాలన్నారు. డ్రాఫ్ట్ ఆర్ ఓ ఆర్ అప్లికేషన్ అయిన వెంటనే వెరిఫికేషన్ చేయాలని కలెక్టర్లను ఆదేశించారు. మ్యూటేషన్స్ కోసం అందిన దరఖాస్తులను పెండింగ్ లేకుండా నెల లోపు పూర్తి చేసేలా సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.
జిల్లా కలెక్టర్ డా. కే. మాధవీలత మాట్లాడుతూ భూ సర్వే పనులు జరుగున్నాయన్నారు. జిల్లాలో 272 గ్రామాలలో 44 గ్రామాలు పూర్తయ్యాయని, 15 రోజుల్లో భూ హక్కు పత్రాలను పంపిణీ చేసే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని వివరించారు.
Prajavartha Online Telugu News