విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆల్ ఇండియా లోకో రన్నింగ్ స్టాఫ్ అసోసియేషన్ (ఏఐఎల్‌ఆర్‌ఎస్‌ఏ) స్వర్ణోత్సవ సంబరాలు, జాతీయ 23వ ద్వైవార్షిక మహాసభల సందర్భంగా ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణ కోసం మహా ప్రదర్శన, బహిరంగసభను ఈనెల 28న నిర్వహిస్తున్నామని, కార్యక్రమ కన్వీనర్ టి.హనుమయ్య, కార్యదర్శి ఎస్.గురుమూర్తి తెలిపారు. శనివారం గాంధీనగర్‌లోని ప్రెస్‌క్లబ్‌లో జరిగిన కార్యక్రమంలో బ్రోచరును ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు ఎంబీవీకే భవన్ నుంచి జింఖానా గ్రౌండ్స్ వరకు ప్రజా నాట్యమండలి కళారూపాలు, శకటాలు, విచిత్ర వేషాలు, సాంస్కృతిక కార్యక్రమాలతో సాగుతాయని, సాయంత్రం 4 గంటలకు బహిరంగ సభ జరుగుతుందని తెలిపారు. సీఐటీయూ ప్రధానకార్యదర్శి తపన్సేన్, రైల్వే పార్లమెంటరీ స్టాండిరగ్ కమిటీ చైర్మన్ బాసుదేవ్ ఆచార్య, ఎమ్మెల్సీ కె.ఎస్. లక్ష్మణరావు బహిరంగ సభలో ప్రసంగిస్తారని తెలిపారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేయడం బలహీనవర్గాలు రిజర్వేషన్లు కోల్పోతారన్నారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అన్ని కార్మిక సంఘాలు, ప్రజలను కలుపుకొని జేఏసీగా ఏర్పడి పోరాడుతామన్నారు.
Prajavartha Online Telugu News