విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రానికి ప్రత్యేక హోదా నిర్ణయంపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) రాష్ట్ర కమిటీ నాయకుడు జి.ఎస్.ఫణీరాజు డిమాండ్ చేశారు. శనివారం విజయవాడ ధర్నాచౌక్లో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తే పన్ను రాయితీలు ఉంటాయని, పెట్టుబడిదా రులు ఆకర్షితులవుతారని తెలిపారు. పరిశ్రమల స్థాపనకు బడా పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తారని పేర్కొన్నారు. యువతకు ఉద్యోగావకాశాలు అధికంగా ఉంటాయని, ఉపాధి కోసం పక్క రాష్ట్రాలకు వలస వెళ్లాల్సిన అవసరం ఉండదని చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో యువకులు పొరుగు రాష్ట్రా లకు వెళ్లి, సెక్యూరిటీ గార్డులుగా, ఆటో డ్రైవర్లుగా పని చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ర్యాపిడో డ్రైవర్లుగా పని చేస్తున్నారని పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుతో.. యువత తీవ్ర అవస్థలు పడుతున్నా రని చెప్పారు. ప్రత్యేక హోదా విషయమై మూడు ప్రధాన పార్టీలు నోరు విప్పాలని డిమాండ్ చేశారు. యువత భవి ష్యత్తు కోసం ఆప్ పోరాటాలు చేస్తూనే ఉంటుందని వెల్లడిర చారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సి.హెచ్ బాబూరావు మద్దతు తెలిపారు. ప్రధానమైన మూడు పార్టీ లపై పలు విమర్శలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆప్ రాష్ట్ర సలహాదారుడు పోతిన వెంకట రామారావు, ఆల్ ఇండియా జైహింద్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు దశరథరామ రెడ్డి, v. నవీన్ రెడ్డి, కే. సరస్వతి, అర్చన, అమానుల్లా ఖాన్ పలువురు నాయకులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News