గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
విలీన గ్రామాలు, టిడ్కో గృహ సముదాయాలకు త్రాగునీరు అందించే లక్ష్యంతో గోరంట్ల కొండ మీద రిజార్వాయర్, హెడ్ వాటర్ వర్క్స్ నుండి జరుగుతున్న పైప్ లైన్ పనులు వేగవంతం చేయాలని నగర కమిషనర్ కీర్తి చేకూరి ఐఏయస్ నగరపాలక సంస్థ ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. గురువారం కమిషనరు గారు రిజర్వాయర్ పైప్ లైన్ పనులను గోరంట్ల, ఇన్నర్ రింగ్ రోడ్, గడ్డిపాడు రైల్వే లైన్ క్రాసింగ్ తదితర ప్రాంతాల్లో తనిఖీ చేసి ఇంజినీరింగ్ అధికారులకు తగు ఆదేశాలు జారి చేశారు.
ఈ సందర్భంగా కమిషనర్ గారు తొలుత పైప్ లైన్ పనుల పురోగతి పై కాంట్రాక్టర్ ని, ఇంజినీరింగ్ అధికారులను అడిగి తెలుసుకొని మాట్లాడుతూ గోరంట్ల కొండ మీద రిజర్వాయర్ ప్రాజెక్ట్ నగరానికి ఎంతో కీలకమైనదని, కొన్ని లక్షల మంది త్రాగునీరు అవసరాలు తీర్చే ప్రాజెక్ట్ అన్నారు. అంతటి ప్రాధాన్యత కలిగిన ప్రాజెక్ట్ పనుల జాప్యం పై కాంట్రాక్టర్ పై అసహనం వ్యక్తం చేసి, తక్షణం అదనపు కార్మికులను తెప్పించుకొని పనులు వేగవంతం చేయాలన్నారు. కొండ మీద రిజర్వాయర్ రాబోవు రెండు నెలల్లో పూర్తీ అయ్యేలా కార్యాచరణ ప్రకారం పనులు జరగాలని, టిడ్కో గృహ సముదాయాలకు త్రాగునీరు అందించే పైప్ లైన్ పనులు దాదాపు పూర్తి అయ్యాయన్నారు. అమరావతి రోడ్ క్రాసింగ్, మరో 3 ఇంటర్ కనెక్షన్లు రెండు రోజుల్లో పూర్తీ చేసి వచ్చే మంగళవారం పైప్ లైన్ లో నీటి సరఫరా ట్రయిల్ రన్ చేయాలని స్పష్టం చేశారు. కొండ మీదకు వెళ్లే పైప్ లైన్లను కూడా పూర్తీ చేసేలా కాంట్రాక్టర్ మెటీరియల్ తెచ్చుకోవాలని, పనులు ఎట్టి పరిస్తితుల్లో ఆగడానికి వీలు లేదన్నారు. ఏ.ఈ. పూర్తిగా పనుల పర్యవేక్షణ పై దృష్టి సారించాలని ఆదేశించారు. పర్యటనలో ఎస్.ఈ. భాస్కర్, ఈ.ఈ. శాంతి రాజు, డి.ఈ.ఈ. హనీఫ్, ఏ.ఈ. రాము, సచివాలయ కార్యదర్శులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News