Breaking News

దరఖాస్తులను 3 రోజుల్లో పరిష్కరించాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
స్పెషల్ సమ్మరి రివిజన్ 2023లో భాగంగా అందిన దరఖాస్తులను 3 రోజుల్లో పరిష్కరించాలని నగర కమిషనర్, ఎలక్ట్రోరల్ రిజిస్టర్ ఆఫీసర్ (ఈ.ఆర్.ఓ.) కీర్తి చేకూరి ఐఏయస్  ఎలక్షన్ సూపర్వైజర్లకు స్పష్టం చేశారు. గురువారం కమిషనరు గారు తమ చాంబర్ లో దరఖాస్తుల పరిష్కారం, స్వీప్ కార్యక్రమాల పై సమీక్షా సమావేశం జరిగింది.  ఈ సందర్భంగా కమిషనర్  బి.ఎల్.ఓ.ల వారీగా ఇటీవల జరిగిన స్పెషల్ క్యాంపెయిన్ డే లో అందిన నూతన ఓటు, మార్పులు, చేర్పుల దరఖాస్తులు పెండింగ్ ఉండటం గమనించి సదరు సూపర్వైజర్ల పై ఆగ్రహం వ్యక్తం చేశారు. రానున్న 3 రోజుల్లో పరిష్కారం చేసి నివేదిక ఇవ్వాలని లేకుంటే వారి పై చర్యలు తీసుకోవాలని అదనపు కమిషనర్ ని ఆదేశించారు. ఓట్ల తొలగింపు పై ప్రత్యేక దృష్టి సారించాలని, సూపర్వైజర్ అధికారులు ప్రత్యక్ష్యంగా పరిశీలించే తొలగింపు చేపట్టాలన్నారు. సూపర్వైజర్లు వారి పరిధిలోని విద్యా సంస్థల్లో సిస్టమాటిక్ ఓటర్స్ ఎడ్యుకేషన్ అండ్ ఎలక్ట్రోరల్ పార్టిసిపేషన్ (స్వీప్)లో భాగంగా నూతన ఓటర్ల కోసం అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. అర్హులైన వారిని ఓటర్లుగా నమోదు చేయాలన్నారు. కార్యక్రమంలో పశ్చిమ ఈ.ఆర్.ఓ., నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ పి.రోజ, ఏ.ఈ.ఆర్.ఓ.లు బి.శ్రీనివాసరావు, టి.వెంకట కృష్ణయ్య, మూర్తి, కోటయ్య, ఎలక్షన్ సెల్ సూపరిండెంట్ పద్మ, సూపర్వైజరి అధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *