Breaking News

ఓటర్‌ డేటాకు ఆధార్‌ అనుసంధాన ప్రక్రియ…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఓటర్‌ డేటాకు ఆధార్‌ అనుసంధానం నూరు శాతం పూర్తి చేసేలా ఓటర్లు, రాజకీయ పార్టీలు సహకరించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు కోరారు.
భారత ఎన్నికల సంఘం అదేశాల మేరకు ఈ ఏడాది ఆగస్టు 1వ తేది నుండి ఓటర్‌ డేటాకు ఆధార్‌ అనుసంధాన ప్రక్రియ దేశమంతటా ప్రారంభమయిందన్నారు. జిల్లాలోని 7 అసంబ్లీ నియోజకవర్గాలలో ఈ ప్రక్రియ జరుగుతుందని దీనిలో భాగంగా జిల్లాలో నవంబర్‌ 9వ తేదిన ప్రచురించిన మూసాయిదా ఓటర్ల జాబితా ప్రకారం జిల్లాలో 16,47,571 మంది ఓటర్లు నమోదు కాగా, వీరిలో 11,52,332 ఓటర్ల కార్డులకు ఆధార్‌ అనుసంధాన ప్రక్రియ పూర్తి కాగా ఇది 69.86 శాతంగా నమోదు అయిందన్నారు. ఇంకనూ మిగిలిన 30.14 శాతం ప్రక్రియను ఈనెల 31వ తేదిలోగా పూర్తి చేయాలనే లక్ష్యాన్ని అధికారులకు నిర్థేశించామన్నారు. జిల్లాలోని తిరువూరు, నందిగామ, జగ్గయ్యపేట నియోజకవర్గాలలో 80 శాతం పైగా పూర్తి కాగా, మైలవరం నియోజకవర్గంలో 70 శాతంగా ఉందన్నారు. విజయవాడ తూర్పు, పశ్చిమ, సెంట్రల్‌ నియోజకవర్గాలలో 60 శాతం ఓటర్‌ డేటాకు ఆధార్‌ అనుసంధానం పూర్తి అయిందన్నారు. విజయవాడ నగరం కావడంతో బూత్‌లెవెల్‌ అధికారులు ఓటర్ల వద్దకు క్షేత్రస్థాయిలో వెళ్లిన్నప్పడు అందుబాటులో లేకపోవడం వలసలు ఉండడం తదితర కారణాలతో ఈ ప్రక్రియ కొంత నెమ్మదిగా సాగుతుందన్నారు. నగరంలో ఓటర్‌ డేటాకు ఆధార్‌ అనుసంధానం ప్రక్రియ వేగవంతం చేసేందుకు ప్రత్యేక ప్రణాళికను అమలు చేస్తున్నామన్నారు. దీనిలో భాగంగా ఓటర్ల డేటాకు ఆధార్‌ అనుసంధానం వలన కలిగే ప్రయోజనాలను ఓటర్లకు వివరించడంతో పాటు ప్రత్యేక ప్రచార దినాలను నిర్వహించడం ద్వారా ఈ ప్రక్రియను వేగవంతం చేస్తున్నామన్నారు. ఓటర్‌ డేటాకు ఆధార్‌ అనుసంధానం జరిగిన తరువాత ఓటరు యొక్క ఆధార్‌ నెంబర్‌, సమాచారం గోప్యంగా ఉంచబడుతుందని భారత ఎన్నికల సంఘం నియమ నిబంధనలలో పొందుపరచారని కలెక్టర్‌ అన్నారు. ఓటర్లు తమ ఓటరు కార్డుకు ఆధార్‌ అనుసంధాన ప్రక్రియను షషష.అఙంజూ.ఱఅ, ప్రత్యేక పోర్టల్స్‌లో గాని బూత్‌లెవల్‌ అధికారి ఇంటికి వచ్చిన్నప్పుడు గాని, సమీపంలోని పోలింగ్‌స్టేషన్‌లో ప్రత్యేకంగా నిర్వహించే అనుసంధాన కార్యక్రమం, ఓటరు స్వయంగా బూత్‌లెవల్‌ అధికారిని కలిసి ఓటర్‌ కార్డుకు ఆధార్‌ అనుసంధానం పూర్తి చేస్తుకోవాలని కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి డిల్లీరావు ఓటర్లను, రాజకీయ పార్టీలను కోరారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *