-జాయింట్ కలెక్టర్ నుపూర్ అజయ్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ రూరల్ మండలం రాయనపాడు, పైడూరుపాడు గ్రామ సచివాలయాలను శుక్రవారం జాయింట్ కలెక్టర్ ఎస్. నుపూర్ అజయ్ ఆకస్మీక తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా సచివాలయ ఉద్యోగులను ఉద్దేశించి జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలు తమ అవసరాలకు అనుగుణంగా సచివాలయాలకు వస్తారని, ఉద్యోగులు పారదర్శకమైన సేవల ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించాలన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి చేరే విధంగా పనిచేయాలని ప్రజా సమస్యలపై అర్జీలు తీసుకుని వాటిని సకాలంలో పరిష్కర దిశగా సంబంధిత అధికారులతో సంప్రదించి పరిష్కరించాలన్నారు. సచివాలయ పరిధిలో పారిశుద్ద్యం మెరుగుపరిచే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఆయా సచివాలయాలలోని అన్ని రకాల రిజిస్ట్రర్లను పరిశీలించారు. ముఖ్యంగా మూమెంట్ రిజిస్ట్రర్ను ప్రత్యేకంగా పరిశీలించి ప్రజలకు అందుబాటులో ఉండాలని జాయింట్ కలెక్టర్ ఉద్యోగులను ఆదేశించారు. తొలుత ఖమ్మం జాతీయ రహదారికి అనుసంధానంగా నిర్మించే గ్రీన్ఫిల్డ్ రహదారుల కొరకు పతిపాధించిన విజయవాడ రూరల్ మండలం రాయనపాడు, పైడూరుపాడు గ్రామాల స్థలాలను జెసి తనిఖీ చేశారు. ముందుగా ఏర్పాటు చేసిన ఆ గ్రామాలలోని స్థలాల కొలతలకు సంబంధించిన హద్దుల ప్లాగ్స్ను పరిశీలించి, స్థలాల ప్రాధమిక విలువలను సర్వే అధికారుల నుండి జాయింట్ కలెక్టర్ నుపూర్ అజయ్ తెలుసుకున్నారు. పరిశీలనలో జాయింట్ కలెక్టర్ వెంట విజయవాడ రూరల్ తహాశీల్థార్ శ్రీనివాస్ నాయక్, సర్వేయర్ ఏ రమేష్, విఆర్వో సత్యవతి, రమేష్ ఉన్నారు.
Prajavartha Online Telugu News