Breaking News

SHG మెంబర్స్ కు అవగాహనా సదస్సు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
Managing Director, MEPMA  అదేశానుసారం ది.25-11-2022 నుండి ది.23-12-2022 వరకు ఇంటర్ నేషనల్ డే ఫర్ ది ఎలిమినేషన్ అఫ్ వైలేన్స్ ఎగైనెస్ట్ ఉమెన్ గురించి పొదుపు సంఘాల సభ్యులకు అవగాహనా కల్పించవలసినదిగా తెలిపారు. దానిలో భాగంగా విజయవాడ నగర పాలక సంస్థ, యు.సి.డి విభాగము అధ్వర్యంలో ది.2-12-2022 న 30 వ డివిజన్ మధ్యకట్ట ప్రాంతంలో గల Self Help Group (SHG) మెంబర్స్ కు అవగాహనా సదస్సు నిర్వహించడమైనది.ఈ కార్యక్రముమునకు ముఖ్య అతిధులుగా యు.సి.డి ప్రాజెక్టు ఆఫీసర్  కే. శకుంతల, Intigrated Child Development Services (Anganwadi Centres) (ICDS), Child Development Project Officer (CDPO) మంగమ్మ పాల్గొన్నారు. వీరు ప్రతి ఒక్కరు తమ పిల్లల విషయములో కూతురని కొడుకని తారతమ్యం చూపకుండా ఇద్దరికి సమాన విద్య కల్పించాలి, మహిళలను గౌరవించే విధానం నేర్పించాలని, మహిళల కొరకు తీసుకువచ్చిన గృహహింస, బాల్య వివాహలు  మొదలైన చట్టాలు గురించి వివరించారు. ఈ విషయాలను మీ యొక్క సంఘాల సమావేశములో సభ్యులందరికీ అవగాహనా కల్పించవలసినదిగా తెలిపారు. వార్డు సచివాలయ మహిళా పొలిసు మహిళలు ఎదుర్కొనే సమస్యలను తమ దృష్టికి తీసుకువచ్చినచొ పరిష్కారము చేసుకోవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమములో పొదుపు సంఘాల సభ్యులు Slum Level Federation (SLF) మరియు Town Level Federation (TLF),  U.C.D సభ్యులు, యు.సి.డి సిబ్బంది, ICDS సిబ్బంది పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *