తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
ముఖ్యమంత్రి వై యస్ జగన్మోహన్ రెడ్డి సూళ్లూరుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య వారి కుమార్తె వివాహానికి నెల్లూరు జిల్లాలో హాజరై తిరుగు ప్రయాణంలో నేటి సాయంత్రం 05.10 గం. కు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న వీరికి రాష్ట్ర భూగర్భ గనులు అటవీ విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, చిత్తూరు జిల్లా కలెక్టర్ హరి నారాయణన్ తిరుపతి జిల్లా కలెక్టర్ కె వెంకటరమణారెడ్డి, నెల్లూరు జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు, ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి సాదర వీడ్కోలు పలికారు. వీరితో పాటుగా అడిషనల్ ఎస్పీ కులశేఖర్ శ్రీకాళహస్తి ఆర్ డి ఓ రామారావు, డిఎస్పీ లు రామచంద్రయ్య, సురేంద్ర, నంద కిషోర్, ఏర్పోర్టు సి ఎస్ ఓ రాజశేఖర్ రేణిగుంట తాసిల్దార్ శివప్రసాద్ తదితరులు ఉన్నారు. అనంతరం 05.20 కి ముఖ్యమంత్రి జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు తో కలిసి గన్నవరం విమానాశ్రయానికి తిరుగు పయణమయ్యారు.
Prajavartha Online Telugu News