Breaking News

రానున్న మూడురోజులు అధికారులు అప్రమతం కావలి : జేసి డికె బాలాజీ

తడ, నేటి పత్రిక ప్రజావార్త :
తుపాన్ నేపద్యంలో మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్ళరాదని, పునరావాస కేంద్రాలలో ప్రజలకు సౌకర్యాలు కల్పించాలి. రానున్న మూడురోజులు అధికారులు అప్రమతం వుండాలని జేసి డి కి బాలాజీ అధికారులను ఆదేశించారు. బుధవారం మధ్యాహ్నం తీర ప్రాంతాలలో పర్యటించిన జాయింట్ కలెక్టర్ అధికారులకు. ప్రజలకు పలు సూచనలు చేసారు. జేసి మాట్లాడుతూ నేటి ఉదయం వరకు జాలర్లు సముద్రంలో వున్న 84 మంది రాలేదని తెలిసి అప్రమత్తంకోసం పర్యటించడం జరిగిందని అన్నారు. స్థానికులు వచ్చారని తెలపడంతో అధికారులు, గ్రామస్తులు, సంయుక్తంగా కలసి సమాచారం అందించి తీసుకురావడం సంతోషమని తెలిపారు. తడ కుప్పం గ్రామంలో పర్యటించి గుడిసెల్లో నివాసం వున్న వారిని తక్షణమే హైస్కూల్లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రానికి తరలించాలని అధికారులకు సూచించి ఏర్పాటు చేసారు. అనతరం అధికారులు ఈ మూడు రోజులు స్థానికంగానే అందుబాటులో వుండి సహాయక చర్యలు చేపట్టాలని సూచించారు. అందుబాటులో వున్న రేషన్, త్రాగునీరు, వసతి పరిశీలించారు. పోలీస్.. అధికారులు, సిబ్బంది జేసి పర్యటనలో వున్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *