Breaking News

ఏపి ఇంధన శాఖ మంత్రి, అధికారులను అభినందించిన సీఎం జగన్‌

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఏపి ఇంధన శాఖ జాతీయ ఇంధన పరిరక్షణ అవార్డు గెలుచుకోవడంపై మంత్రి, అధికారులను ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి అభినందించారు. ఇంధన పొదుపు, సంరక్షణలో జాతీయ స్ధాయిలో సత్తా చాటిన ఆంధ్రప్రదేశ్‌, ఇంధన భద్రత దిశగా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషిని గుర్తించి ప్రతిష్టాత్మక జాతీయ ఇంధన పరిరక్షణ అవార్డుకు ఏపీని కేంద్రం ఎంపిక చేసింది. ఇటీవల ఢల్లీిలో నిర్వహించిన అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో రాష్ట్రపతి చేతుల మీదుగా అందుకున్న అవార్డును సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌కు ఇంధనశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కే.విజయానంద్‌, ఆంధ్రప్రదేశ్‌ ఇంధన పరిరక్షణ మిషన్‌ సీఈవో ఏ.చంద్రశేఖర్‌ రెడ్డి, ఏపీ ట్రాన్స్‌కో జేఎండీ ఐ.పృద్వితేజ్‌ అవార్డును చూపించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *