Breaking News

వారం రోజులు CLAP SPECIAL DRIVE

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కమీషనరు ఆదేశాల ప్రకారం వారం రోజులు CLAP SPECIAL DRIVE లో భాగంగా ఈరోజు అనగా 17-12-2022వ తేదిన 45వ డివిజన్ నందు యండూరి రామలింగేశ్వర రావు హై స్కూల్ లో CLAP స్పెషల్ శానిటేషన్ డ్రైవ్, తడి చెత్త, పొడి చెత్త పై అవగాహన, మానవ హారం, స్వచ్ఛ భారత్ ప్రతిజ్ఞ జరిగినది. జోనల్ కమీషనరు–I గారు శ్రీ కె.టి.సుధాకర్ వారి ఆధ్వర్యంలో పాఠశాల విద్యార్ధులు, సచివాలయ సెక్రటరీలతో స్వచ్ఛ సర్వేక్షణ్ -2023 నందు మొదటి ర్యాంకు తెచ్చు కొనుటకు అందరూ సహకరించాలని ప్రతి ఇంట్లో తడి చెత్త, పొడి చెత్త, ప్రమాదకర వ్యర్దాలుగా విభజించి విజయవాడ నగర పాలక సంస్ధ వారికి అంద జేయాలని, ప్లాస్లిక్ కవర్లు నిషేధించి గుడ్డ సంచులు వినియోగించాలని, నగరము నందు బహిరంగ మల మూత్ర విసర్జన జరగకుండా చర్యలు తీసుకోవాలని నగరాన్ని స్వచ్చ విజయవాడ గా ఉంచాలని స్వచ్ఛ భారత్ పరిశుభ్రత పోటీలలో విజయవాడ నగరానికి మొదటి ర్యాంకు తీసుకొని వచ్చుటకు అందరూ కృషి చేయాలని వారందరితో ప్రతిజ్ఞ చేయించినారు. ఈ కార్యక్రమాన్ని చీఫ్ మెడికల్ ఆఫీసర్ ఆఫ్ హెల్త్ డాII పి.రత్నావళి  స్పెషల్ డ్రివ్ ను ప్రారంభించారు. శానిటరీ సూపర్ వైజరు ఆర్.ఓబేశ్వర రావు, కె.శివ రామ ప్రసాద్ అలాగే శానిటరీ ఇన్ స్పెక్టర్లు సచివాలయ సిబ్బంది, స్కూల్ ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు, విద్యార్ధులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *