-కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నగర పర్యటనలో భాగంగా నేడు నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఐ.ఏ.ఎస్ గారు సింగ్ నగర్ నందలి ఎక్సెల్ ప్లాంట్ ను మరియు ఐకానిక్ పార్కులో జరుగుతున్న పనులను అధికారులతో కలిసి పర్యటించారు. ఎక్సెల్ ప్లాంట్ ఆవరణలో జరుగుతున్న అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని, ప్రవేశ ద్వారము వద్ద సెక్యూరిటీ గార్డ్ రూము, మరియు ప్లాంట్ ఆవరణలో జరుగుతున్న రోడ్డు పనులను పూర్తి చేయాలని మరియు ప్రవేశ ద్వారమును నుండి వేబ్రిడ్జి వరకు గల మార్గమును BT రోడ్డును వేయాలని అధికారులకు ఆదేశించారు. ప్లాంట్ ఆవరణలో చేపడుతున్న అభివృద్ధి పనుల గురించి మార్కింగ్ చేసి చూపించామని ఇంజనీరింగ్ అధికారులకు ఆదేశించారు,అదే విధంగా ఎక్సెల్ ప్లాంట్ కు ఎదురుగా అభివృద్ధి చేస్తున్న ఐకానిక్ పార్క్ లో జరుగుతున్న పనులను వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశించారు. పర్యటనలో అదనపు కమీషనర్ (ప్రాజెక్ట్స్) కె.వి సత్యవతి,ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సత్యనారాయణ రావు, శానిటరీ ఇన్స్ పెక్టర్లు మరియు సచివాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News