Breaking News

స్పందన లో వచ్చు సమస్యల అర్జీలకు సత్వర పరిష్కారం చూపాలి.

-మౌలిక సదుపాయాలలో ఎదుర్కోను ఇబ్బందులపై దృష్టి సారించాలి
-కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
న‌గ‌ర పాల‌క సంస్థ ప్ర‌ధాన కార్యాల‌యంలో సోమవారం స్పందన కార్యక్రమము నిర్వ‌హించారు.కమిషనర్ శ్రీ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఐ.ఏ.ఎస్, ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. స్పంద‌నలో ప్రజల నుండి వచ్చిన వినతులకు సంపూర్ణ పరిష్కారం అందించేందుకు కృషి చేస్తున్నామని అన్నారు. నేటి స్పందనలో మొత్తం 17 అర్జీలు సమర్పించగా వాటిలో ఇంజనీరింగ్ విభాగం-8, పట్టణ ప్రణాళిక విభాగం – 4, రెవెన్యూ – 4, యు.సి.డి (పి.ఓ)- 1, విభాగాములకు సంబందించిన అర్జీలు వచ్చినవి. కార్యక్రమంలో చీఫ్ మెడికల్ ఆఫీసర్ డా. పి.రత్నావళి, ప్రాజెక్ట్ ఆఫీసర్ (యు.సి.డి) శకుంతల, డిప్యూటీ కమిషనర్ (రెవిన్యూ) డి.వెంకటలక్ష్మి, జాయింట్ డైరెక్టర్ (అమృత్) డా.కె.బి.ఎన్.ఎస్ లతా, సిటీ ప్లానర్ జి.వి.జి.ఎస్.వి ప్రసాద్, ఏ.డి.హెచ్ శ్రీనివాసు, రావు మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.

సర్కిల్ కార్యాలయాలలో స్పందన – 6 అర్జీలు
సర్కిల్ కార్యాలయాలలో జోనల్ కమిషనర్లు స్పందన కార్యక్రమము నిర్వహించగా సర్కిల్ – 2 కార్యాలయంలో , హౌసింగ్ – 1, ఇంజనీరింగ్ విభాగం – 1 అర్జీలు, సర్కిల్ – 3 కార్యాలయంలో ఇంజనీరింగ్ విభాగం – 1, పబ్లిక్ హెల్త్ విభాగం – 1 ప్రణాళిక విభాగం – 2 అర్జీలు మరియు సర్కిల్ – 1 కార్యాలయంలో ప్రజలు ఎటువంటి ఆర్జీలు అందించుట జరగలేదని జోనల్ కమిషనర్లు తెలియజేసారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *