విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సిటిజన్ పర్సెప్షన్ సర్వే ప్రతి ఇంటికి చేరేలా మరియు విజయవాడ పౌరులు అధిక సంఖ్యలో ఈ సర్వే లో పాల్గొనడానికి విజయవాడ నగర పాలక సంస్థ పని చేస్తోంది. కమీషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ సూచనల మేరకు భారత కేంద్ర ప్రభుత్వం ద్వారా నిర్వహించబడుతున్న ఈజ్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ 2022పై సిటిజన్ పర్సెప్షన్ సర్వేలో భాగంగా, దాదాపు 3 లక్షల సిటిజెన్ పర్సెప్షన్ సర్వే కరపత్రాలను పంపిణీ చేసింది. ప్రతి ఇంటికి CPS చేరేలా మరియు నగర విజయంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావడానికి ప్రజలను ప్రోత్సహించడానికి ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. ఇవే కాకుండా మున్సిపల్ కార్పొరేషన్ ద్వారా అనేక వినూత్న కార్యక్రమాలు చేపడుతోంది. సర్వే డిసెంబర్ 23న ముగియనున్నందున, eol2022.org వెబ్సైట్లో మన సిటీ కోడ్ 802969 ఇచ్చి కొన్ని సాధారణ ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం ద్వారా అందరూ తమ నగరానికి తమ మద్దతును అందించాలని అభ్యర్థించారు.
Prajavartha Online Telugu News