విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా వేలాదిమంది నిరుపేదలకు ఆర్ధిక సహాయాలు అందజేస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేదల గుండల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని తూర్పు నియోజకవర్గ వైసీపీ ఇంచార్జ్ అవినాష్ అన్నారు. గురువారం నాడు నియోజకవర్గంలోని 13 మరియు 18వ డివిజన్లకి సంబంధించిన 5 మంది నిరుపేదలకు మంజూరైన ఎనిమిది లక్షల రూపాయల విలువైన ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను గుణదల నియోజకవర్గ కార్యాలయంలో అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో ముఖ్యమంత్రి సహాయనిధి పొందాలి అంటే టీడీపీ వారికి, జన్మభూమి కమిటీల వారికి లంచాలు ఇచ్చి కళ్ళారిగెల కార్యాలయాల చుట్టూ తిరిగిన సరే వస్తాయనే నమ్మకం ఉండేది కాదని,నిరుపేదలకు అండగా ఉండాల్సిన ముఖ్యమంత్రి సహాయనిధి ని నిర్విర్యం చేసి కేవలం వారి పార్టీ వారి ఆర్థిక అవసరాలు తీర్చుకొనేల ఉపయోగించుకొన్నారని విమర్శించారు. కానీ నేడు వైస్సార్సీపీ ప్రభుత్వం లో పారదర్శకంగా ఎవరికి లంచాలు ఇచ్చే పని లేకుండా కులమత పార్టీలకతీతంగా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఆర్థిక భరోసా గా ముఖ్యమంత్రి సహాయనిధి నిలుస్తోంది అని అన్నారు.ఆరోగ్య శ్రీ పరిధిని పెంచి పేదలకు సైతం కార్పొరేట్ వైద్యం చేరువ చేసిన ఘనత వైసీపీ ప్రభుత్వం దే అని,ప్రక్క రాష్ట్రలలో కూడా ఈ పధకం ద్వారా వైద్య చికిత్స చేపించుకోవచ్చు అని తెలిపారు. ఆరోగ్య శ్రీ పరిధిలో లేని వైద్య సేవలకు ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా ఆర్థిక భరోసా కల్పిస్తున్నారని, ఎవరైనా ఆర్జి పెట్టుకోవాలి అంటే మా కార్యాలయంలో సిబ్బంది ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారని అవినాష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో 13వ డివిజన్ ఇంచార్జ్ రామయణపు శ్రీనివాస్, వైస్సార్సీపీ నాయకులు సొంగా రాజ్ కమల్, సుభాషాని, హసాన్ పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News