విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
భారత పార్లమెంట్ చట్ట ప్రకారం భారత ప్రభుత్వ టెక్స్ టైల్స్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబడిన, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ లో అడ్మిషన్స్ కు ప్రవేశ పరీక్షకు ఈనెల 31 వ తేదీలోపు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ ప్రొఫెసర్ జి చిరంజీవి రెడ్డి తెలిపారు. విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చిరంజీవి రెడ్డి మాట్లాడుతూ నూరు శాతం ఉద్యోగ అవకాశాలు కలిగిన కోర్సులు నేషనల్ ఫ్యాషన్ టెక్నాలజీ లో అందుబాటులో ఉన్నాయని చెప్పారు. సరైన అవగాహన లేక తెలుగు రాష్ట్రాల్లోని విద్యార్థులు ఈ కోర్సులకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఉద్యోగ అవకాశాలు కలిగిన ఈ కోర్సులను తెలుగు రాష్ట్రంలోని విద్యార్థిని, విద్యార్థులు ఉపయోగించుకొని వారు భవిష్యత్తుకు బంగారు బాట వేసుకోవాలని సూచించారు. దేశవ్యాప్తంగా 18 కాలేజీలు ఉన్నాయని, ఈ కాలేజీలలో చదివే విద్యార్థిని, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్ షిప్ వంటి సదుపాయాలు కూడా కలవని తెలియజేశారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ లోని వివిధ కోర్సులపై నేడు విజయవాడలోని లైయోలా కాలేజీ లో తల్లిదండ్రులకు, విద్యార్థులకు కౌన్సిలింగ్ ఏర్పాటు చేయడమైనది తెలియజేశారు. విద్యార్థులు, తల్లిదండ్రులు ఈ కౌన్సిలింగ్ లో పాల్గొని వారి సందేహాలను నివృత్తి చేసుకోవాల్సిందిగా కోరారు ఈ కార్యక్రమంలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ప్రొఫెసర్ కేకే బాబు, అసిస్టెంట్ ప్రొఫెసర్ యువరాజు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News