Breaking News

కాపులకు ప్రాధాన్యత ఏది…?

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కాపు సామాజిక వర్గం పట్ల ఎంతో అభిమానం ఉందని చెప్పుకొస్తున్న యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ రాజధాని పరిధిలోని విజయవాడ తూర్పు, పశ్చిమ, మధ్య నియోజకవర్గాల పరిధిలో ఒక్క సీటు నైనా కాపు సామాజిక వర్గానికి కేటాయించకపోవడం పట్ల ఐక్య కాపునాడు రాష్ట్ర అధ్యక్షులు బేతు రామ్మోహనరావు ఒక ప్రకటనలో ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని జాతీయ, ప్రాంతీయ పార్టీలు రాష్ట్రంలోని కాపు జనాభా దామాషా దృష్టిలో పెట్టుకొని సముచితమైన సీట్లు కేటాయించాలని అన్ని పార్టీలకు విజ్ఞప్తి చేశారు. తమ సామాజిక వర్గానికి ప్రాధాన్యత కల్పించే పార్టీలకే తాము మద్దతు తెలుపుతామని పేర్కొన్నారు. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలలో సీట్ల కేటాయింపు ఎలా ఉన్నప్పటికీ రాజధాని పరిధిలో మాత్రం కాపులకు తగిన ప్రాముఖ్యత ఇవ్వాలని వైసిపి అగ్ర నేతలకు విజ్ఞప్తి చేశారు.కాపుల ఆరాధ్య దైవం బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి వంగవీటి మోహన రంగా గారి జిల్లా పేరు కృష్ణా జిల్లా కి పెట్టి చిత్త శుద్ధి తో ప్రేమ అభిమానం పొందాలని లేకపోతే తమ సామాజిక వర్గాన్ని తృణీకార భావంతో చూసేవారు రాను ఎన్నికల్లో తగిన మూల్యం చెల్లించక తప్పదని బేతు హెచ్చరించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *