విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ పశ్చిమ నియోజకవర్గం లో యువశక్తి ప్రచార కార్యక్రమం మూడవ రోజున 37 వ డివిజన్ అధ్యక్షులు శిగినంశెట్టి రాము గుప్తా ఆధ్వర్యంలో రమణయ్య కూల్ డ్రింక్ షాప్ వద్ద నుంచి బయలుదేరి మెయిన్ బజార్ మోడరన్ కేఫ్ విజయ బ్యాకరి వరకు నిర్వహించినారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పశ్చిమ నియోజకవర్గం ఇంచార్జ్ విజయవాడ నగర అధ్యక్షులు రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేష్ పాల్గొని ప్రతి షాప్ కు వెళ్లి కరపత్రాలను అందజేస్తూ వ్యాపారస్తుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వ్యాపారస్తులు మహేష్ తో జగన్మోహన్ రెడ్డి పాలన సరిగా లేదని, కొన్ని రోజులు అసలు బోణి కూడా కావడం లేదని, పండగ వస్తే ఆనందం పోయి బాధ కలుగుతుందని, జగన్ పాలన ఎప్పుడు పోతుందా అని దేవుడికి దండం పెట్టుకుంటున్నామని, జగన్ పాలనలో ఇక్కడ వ్యాపారం చేయడం కన్నా ఒరిస్సా వెళ్లి మరమరాలు అమ్ముకుంటే బాగుంటుందనిపిస్తుందని, ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం మహేష్ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్, చంద్రబాబు కలయికతో వైయస్సార్సీపీ నాయకుల్లో ఓటమి భయం మొదలైందని అందుకే ఇష్టానుసారం మాట్లాడుతున్నారని తప్పక అతి తొందరలోనే వారి భయం నిజమై అధికారం కోల్పోతారని, జగన్ పాదంలో వ్యాపారస్తులు నిత్యం బోణి కూడా కాకుండా నిరాశ నిస్పృహలతో మంచి రోజులు కోసం ఎదురుచూస్తున్నారని, మేము వ్యాపారస్తుల సమస్యలు పరిష్కరించేందుకు పోరాటం చేస్తామని వారికి ఏ సందర్భంలో అయినా అండగా నిలబడతామని, విరాళాల కోసం వెల్లంపల్లి శ్రీనివాస్ వ్యాపారస్తుల్ని అనేక సందర్భాల్లో వేధించారని సమయం కోసం వ్యాపారస్తులందరూ ఎదురుచూస్తున్నారని తప్పక సరైన సందర్భంలో వెల్లంపల్లి శ్రీనివాస్ కు తగిన బుద్ధి చెప్తారన్నారు. ఈ కార్యక్రమంలో తవ్వా మారుతి, కొండేటి దేవానంద్, చల్ల ఏసు బాబు, కిలని రాము యాదవ్ ,దుర్గ రావు , ,బేతాళం రవికుమార్, మదన స్టాలిన్ శంకర్, కొప్పిరెడ్డి సత్యనారాయణమూర్తి, హనుమాన్ తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News