Breaking News

బీసీ ల సమస్యల పై అలుపెరుగని పోరాటం చేస్తాం…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
బీసీ సంక్షేమ సంఘాన్ని మరింత బలోపేతం చేసి బీసీ ల సమస్యల పై అలుపెరుగని పోరాటం చేస్తామని జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట కన్వీనర్ బోను దుర్గ నరేష్ తెలిపారు. తాము అందరం ఆర్.కృష్ణయ్య సూచన మేరకు పని చేస్తామని పేర్కొన్నారు. సంఘం లో పదవులు ఉండి పని చేయకపోతే వారిని తప్పించి పని చేసే వారికి అవకాశం ఇస్తామని ఆయన స్పష్టం చేశారు.గాంధీనగర్ లోని ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కన్వీనర్ బోను దుర్గ నరేష్ మాట్లాడుతూ… రాబోయే ఎన్నికల్లో బీసీ లు ఏ విధంగా పని చేయాలి బీసీ ల సమస్యలు పై ఏ విధంగా పోరాడాలి అనే దానిపై సంఘం ముఖ్య నేతలు తో జాతీయ అధ్యక్షులు,రాజ్య సభ సభ్యులు ఆర్.కృష్ణయ్య సమావేశం అయినట్లు చెప్పారు. కృష్ణయ్య సూచన మేరకు తాము అంతా పని చేస్తామని అన్నారు.పదవులు తీసుకొని సంఘం కోసం పని చేయకపోతే వారిని పదవులు నుంచి తప్పించటం జరుగుతుంది అని హెచ్చరించారు. ఈ నెల 17వ తేదీన పాలకొల్లు లో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు ఆయన చెప్పారు. అదే విధంగా బీసీ సంక్షేమ సంఘం తరపున అనేక కార్యక్రమాలు చేసి సంఘం బలోపేతానికి కృషి చేసిన మెండి జ్యోతి ని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర మహిళ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించినట్లు చెప్పారు. ఈ మేరకు ఆమెకు నియామక పత్రాన్ని అందచేశారు. అతి తక్కువ సమయంలోనే కష్టపడి పైకి వచ్చిన జ్యోతి కి శుభాకాంక్షలు తెలియజేశారు. సంఘంలో కష్టపడి పనిచేసిన వారికి పదవులు వస్తాయనటానికి జ్యోతినే ఉదాహరణ అని చెప్పారు. పాలకొల్లు లో జరిగే సభ అనంతరం బీసీ సంక్షేమ సంఘంలో అనేక మార్పులు వస్తాయని అన్నారు.
అనంతరం మెండి జ్యోతి మాట్లాడుతూ…తనపై నమ్మకంతో ఈ పదవి ఇచ్చినందుకు ఆర్.కృష్ణయ్య కు, బోను దుర్గ నరేష్ కి కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తు లో మరింత కష్టపడి పని చేస్తానని హామీ. ఇచ్చారు. బీసీ ల సమస్యల పట్ల అలుపెరుగని పోరాటం చేస్తానని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం నగర కమిటీ నేతలు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *