Breaking News

బీజేపీ ఓబీసీ మోర్చా “ప్రజా నిరసన”

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా ఎన్టీఆర్ జిల్లా ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులు బి ఎస్ కే పట్నాయక్ అధ్యక్షతన అధికార ప్రభుత్వం బీసీ హాస్టల్లో సంక్షేమం మరిచినందుకు నిరసనగా “ప్రజా నిరసన” కార్యక్రమం సోమవారం అలంకార్ సెంటర్ ధర్నా చౌక్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి ఓబిసి మోర్చా రాష్ట్ర అధ్యక్షులు గోపి శ్రీనివాస్ ముఖ్యఅతిథిగా పాల్గొని నిరసన ప్రదర్శనలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యరా వైఖరికి బీసీ హాస్టల్ పై ఏమాత్రం బాధ్యత లేకుండా నిర్వహణ లోపాన్ని రాష్ట్రంలో అన్ని బీసీ హాస్టల్ లో జిల్లా టీములతో పర్యవేక్షించాలని ఆయన తెలియజేశారు. అన్ని హాస్టల్లో జరుగుతున్నటువంటి లోపాలను ఎండగట్టారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే బీసీ హాస్టల్ ను మెరుగుపరచిన యెడల రాబోయే కాలంలో పెద్ద ఉద్యమాన్ని చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా పదాధికారులు, ఓబీసీ మోర్చా పదాధికారులు, భారతీయ జనతా పార్టీ నాయకులు విజయనగరం జిల్లా ఇన్చార్జి అడ్డూరి శ్రీరామ్, జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీధర్, ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు పల్లపు రాజు, స్టేట్ ప్రోగ్రాం కమిటీ కోకన్వీనర్ లక్ష్మణరావు, సోషల్ మీడియా కన్వీనర్ రాజేష్, శివ, లలిత, నరేష్, కుమార్ భాజపా జనరల్ సెక్రెటరీ ఎన్టీఆర్ జిల్లా వెంకట్, ఉపాధ్యక్షులు పొట్టి శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అమరావతిలో ప్రపంచ స్థాయి నేత్ర వైద్య కేంద్రం

-స్వర్ణాంధ్ర, వికసిత్ భారత్ లక్ష్య సాధనకు పాన్ ఐఐటీ నిపుణులు -అమరావతిలో ఎల్వీ ప్రసాద్ ఐ సంస్థకు సీఎం చంద్రబాబు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *