-35 వ డివిజన్ లో పలు అభివృద్ధికి పనులకు శంకుస్థాపన చేసిన
-పశ్చిమ నియోజక వర్గ శాసన సభ్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు, మేయర్ రాయన భాగ్యలక్ష్మి, కమీషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహనరెడ్డి ఆదేశాల మేరకు నగర అభివృద్ధి లక్ష్యంగా మెరుగు పరస్తూ పలు కార్యక్రమాలకు శంఖుస్ధాపనలు చేసి వాటిని అందుబాటులోనికి తీసుకురావటం జరుగుతుందని శాసన సభ్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు అన్నారు. ఈ రోజు పశ్చిమ నియోజక వర్గ సర్కిల్-1 పరిధిలోని 35 వ డివిజన్ లో ఏలూరు లాకులు నుండి మీసాల రాజారావు బ్రిడ్జి వరకు రూ. 125.00 లక్షలతో 15 వ ఆర్ధిక సంఘం (ఎయిర్ పొల్యూషన్) నిధులతో ఏలూరు కాలవ గట్టును గ్రీనరితో అభివృద్ధి చేయుటకు పశ్చిమ నియోజక వర్గ శాసన సభ్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, కమీషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఐ.ఏ.ఎస్ లచే శంఖుస్థాపన కార్యక్రమము ఏర్పాటు చేయడం జరిగినది. పశ్చిమ నియోజక వర్గ శాసన సభ్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గత మూడున్నర సంవత్సరాలుగా నియోజకవర్గ పరిధిలో అనేక అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నవని, ప్రజలకు మెరుగైన సౌకర్యలు కల్పించుటలో నగరపాలక సంస్థ అనేక కోట్ల వ్యయంతో అభివృద్ధి కార్యక్రమములకు శంకుస్థాపనలు చేసి వాటిని ఆ దశ లోనే వదిలి వేయకుండా పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకోవటం జరుగుతుందని అన్నారు.
అదే విధంగా మేయర్ రాయన భాగ్యలక్ష్మి మాట్లాడుతూ పశ్చిమ నియోజకవర్గo పరిధిలోని ఎన్నడు లేని అభివృద్ధి పనులు మా ప్రభుత్వం చేపట్టినట్లు సుదీర్ఘకాలం లో ప్రాధమిక ఆరోగ్య కేంద్రలు, కచ్చా రోడ్లతో మరియు 24 గంటలు నీటి సరఫరా కొత్తగా అభివృద్ధి చెందుతున్న అనేక కాలనీలు సైతం నేడు అభివృద్ధి పరచి ఇంకను జరుగుతున్న అభివృద్ధి పనులను త్వరగా పూర్తిఅయిటట్లు చర్యలు తీసుకోవటం జరుగుతుందని అన్నారు. ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించుటలో నగరపాలక సంస్థ అనేక కోట్ల వ్యయంతో అభివృద్ధి కార్యక్రమములకు శంకుస్థాపనలు చేయుట జరిగిందని నిరంతరo అన్ని నియోజక వర్గములలో అభివృద్ధిని పర్యవేక్షిస్తూ ముందుకు తీసుకువెళ్లటం అభినందనీయమని అన్నారు. నగర ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించుటతో పాటుగా చిన్న పిల్లలను ఆకర్షించే పార్క్ లను ఆధునీకరించుట జరుగుతుందని పేర్కొన్నారు. పార్టీలకు అతీతంగా అన్ని ప్రాంతాలు అభివృద్ది చేయాలన్నదే మా ప్రభుత్వం ఉద్దేశం అని అన్నారు.
ఈ సందర్భంలో కమీషనర్ మాట్లాడుతూ 35 వ డివిజన్ లో సి.సి.రోడ్లు, కమ్యూనిటి హాల్స్ మరియు మిగిలిపోయిన వర్క్స్, భూగర్భ డ్రైనేజి, మంచినీటి సరఫరా పైప్‌లైన్స్, సైడ్ లైటింగ్ వర్క్స్ మరియు పచ్చదనంతో పాటుగా ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణo అందించాలనే లక్ష్యంగా పార్క్ ను అభివృద్ధి చేసి పున: ప్రారంభం చేపట్టిన్నట్లు కమిషనర్ తెలిపారు. ఏలూరు లాకులు నుండి మీసాల రాజారావు బ్రిడ్జి వరకు ఏలూరు కాలవ గట్టును గ్రీనరితో అభివృద్ధి చేయుటకు రూ. 125.00 లక్షల 15 వ ఆర్ధిక సంఘం (ఎయిర్ పొల్యూషన్) నిధులతో చేయడమైనది. అదే విధంగా ప్రజలు కూడా నగరపాలక సంస్థ వారికి సహకరించి మీయొక్క వంతుగా పార్కులలో ఏర్పాటు చేసిన మొక్కలు, పూల కుండీలు గాని ఇతర వస్తువులను జాగ్రత్తగా చూసుకోవాలని డివిజన్లలో ఎటువంటి ఇబ్బందులు గాని సమస్యలు ఉంటే నగరపాలక సంస్థ వారికి తెలియజేయలసిందిగా కోరడమైనది.
కార్యక్రమములో స్థానిక కార్పొరేటర్ బాలసాని మణిమ్మ, అదనపు కమిషనర్ (ప్రాజెక్ట్స్) కె.వి సత్యవతి, ఎగ్జీక్యూటివ్ ఇంజనీర్లు సత్యనారాయణ రావు, ఏ.ఎస్.ఎన్ ప్రసాద్, మరియు ఇతర అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News