-చిన్నా పెద్దా తేడా లేకుండా సంబరాల్లో ఉత్సాహంగా పాల్గొంటున్న నగర ప్రజలు,
-సంక్రాంతి శోభను సంతరించుకున్న యన్.టి.ఆర్ స్టేడియం
-నగర పాలక సంస్థ 2వ రోజు ముఖ్య అతిధిగా పాల్గొన్న జాయింట్ కలెక్టర్ రాజ కుమారి
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో యన్.టి.ఆర్ మునిసిపల్ కార్పోరేషన్ స్టేడియంలో జరుగుతున్న సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. 2వ రోజులో భాగంగా శుక్రవారం ఉదయం ముగ్గుల పోటీలు, మ్యూజికల్ చైర్స్ అత్యంత ఉత్సాహపూరిత వాతావరణంలో సందడిగా జరిగాయి.
ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ రాజకుమారి మాట్లాడుతూ, సంక్రాంతి శోభను గుంటూరు నగరంలోని యన్.టి.ఆర్ స్టేడియంలో నగర పాలక సంస్థ తెచ్చిందని, సంస్కృతి సాంప్రదాయాలను నేటి తరానికి తెలియచెప్పటానికి ఇటువంటి సంబరాలు ఎంతగానో దోహదపడతాయన్నారు. నాటి సాంప్రదాయాలు ప్రజల్లో ఐక్యత, సహృద్భావ వాతావరణం కల్పించేవని, అలాగే ముగ్గు, ఇంటి పరిశరాల పరిశుభ్రం ద్వారా ఆరోగ్య రక్షణకు కూడా దోహదం చేసేవన్నారు. శుక్రవారం జరిగిన ముగ్గుల పోటీలలో పాల్గొన్న వారు పాడి పంటలు, గంగిరెద్దులు వంటి తెలుగు సంస్కృతిని ప్రతిబింబించేలా ముగ్గులు వేయడం ఆనందంగా ఉందన్నారు.
మేయర్ కావటి శివ నాగ మనోహర్ నాయుడు మాట్లాడుతూ, సంక్రాంతి సంబరాలలో 11 మరియు 12 వ తారీఖులలో నగరంలోని నగర పాలక సంస్థ మరియు ప్రైవేట్ పాటశాలల విద్యార్ధులకు వివిధ క్రీడల యందు పోటీలు నిర్వహించుట జరిగిందన్నారు. నేటి నుండి 15 వ తారీఖు వరకు ప్రజలకు ప్రజలకు ఆహ్లాదకరంగా మరియు ఉత్సాహభరితంగా ఉండేలా వివిధ విభాగాలలో పోటీలను నిర్వహించి, పోటీల యందు గెలుపొందిన వారికి బహుమతులు అందజేయుట జరుగుతుందని తెలియచేశారు. అంతేకాక 14 మరియు 15 వ తేదీలలో సినీ మరియు టి.వి కళాకారులచే సంగీత విభావరి మరియు కామెడీ స్కిట్ లను ప్రదర్శించుట జరుగుతుందని తెలియచేశారు.
కమీషనర్ కీర్తి చేకూరి మాట్లాడుతూ, సంబరాలలో భాగంగా వివిధ అంశాలలో నిర్వహించిన పోటీలలో చిన్నా పెద్దా తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఎంతో ఉత్సాహంగా పాల్గోన్నారన్నారు. రోజు వారి పని లో ఉండే వారికి పండుగలు, సంబరాలు నూత ఉత్సాహాన్ని ఇస్తాయని, యన్.టి.ఆర్ స్టేడియంలో పోటీల నిర్వహణలో మేయర్ ప్రత్యక్షంగా పాల్గొని సంబరాలు విజయవంతం అయ్యేలా కృషి చేస్తున్నారన్నారు.
అనంతరం ముగ్గుల మరియు మ్యూజికల్ చైర్స్ లో విజేతలుగా నిలిచిన వారికి బహుమతులు అందించారు.
ముగ్గుల పోటీలలో మొదటి మూడు స్తానాలలో మాధవి, మాధవి లతా,సుజాతలు నిలిచారు, కంసోలేషణ్ బహుమతిని సురేఖ దేవి కి అందించారు. పోటీలలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పార్టిసిపేషన్ సిర్తిఫికేట్, బహుమతి అందించారు. మ్యూజికల్ చైర్స్ విభాగంలో మొదటి మూడు స్తానాలలో అరుణ కుమారి, పద్మావతి, అనూష లు నిలిచారు. సదరు కార్యక్రమంలో కార్పొరేటర్లు నిమ్మల వెంకట రమణ, మహమ్మద్ అబిద్ బాష, డిప్యూటీ కమీషనర్లు టి. వెంకట కృష్ణయ్య, బి. శ్రీనివాసరావు, ఈ.ఈ సురేందర్ రెడ్డి, ఇతర ఇంజనీరింగ్ మరియు వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News