-ఇంధన సామర్థ్యంలో అధునాతన టెక్నాలజీల అమలు
-అంతర్జాతీయ సదస్సు లో ఆంధ్ర ప్రదేశ్ కు అరుదైన అవకాశం..
-ఎస్డీఏలలో ఒక్క ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఇంధన పరిరక్షణ మిషన్ కు మాత్రమే ఆహ్వానం
-ఇంధనపొదుపు , సామర్థ్యం పెంపు కు సంబంధించి అమలు చేస్తున్న ఉత్తమ ప్రమాణాల గురించి వివరించమని ఎస్ఈసిఎంను కోరిన టెరి (TERI)
-చిన్న పరిశ్రమలు ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించడమే లక్ష్యం
-టీఈఆర్ఐ డైరెక్టర్ గిరీశ్ సేథి వెల్లడి
-ఎంఎస్ఎంఈల్లో ఇంధన సామర్థ్య సాంకేతికతల అమలుకు ఏపీలో అపార అవకాశాలున్నాయని వ్యాఖ్య
-ఆరు ఎంఎస్ఎంఈ క్లస్టర్లలో టీఈఆర్ఐ ఇంధన సామర్థ్య అధ్యయనం
-ఇంధన వినియోగం ఎక్కువగా ఉండే రంగాల్లో ఇంధన సామర్థ్య విస్తృతిని పెంచాలి
-అప్పుడే రాష్ట్రం ఇంధన సుస్థిరత సాధిస్తుంది
-బీఈఈ డైరెక్టర్ జనరల్ అభయ్ భాక్రే వెల్లడి
-12 ఎంఎస్ఎంఈల్లో ఇంధన ఆడిట్ నిర్వహించాం
-ఇంధన వాడకం ఎక్కువగా ఉన్న ఎంఎస్ఎంఈల్లో ఐజీఈఏ నిర్వహించనున్న ఏపీఎస్ఈసీఎం
-రాష్ట్ర ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఇంధన సామర్థ్యంలో దేశంలోనే అగ్రస్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ కు మరో అద్భుత అవకాశం లభించింది. ఇంధన పొదుపులో ఇటీవల భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా జాతీయ ఇంధన సంరక్షణ అవార్డును అందుకున్న ఏపీకి, టెక్నాలజీలో అగ్రగామి అయిన జపాన్ సాంకేతికతను అందించాలని ‘ఇంధనం, వనరుల సంస్థ (TERI)’ ఆసక్తి చూపుతుంది.
భారత్ పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్, జపాన్ పర్యావరణ శాఖ మంత్రి అకిహిరో నిషిముర, , జపాన్ సీఐఐ అధ్యక్షుడు సుసుము వాకామోరి, ఫిక్కీ అధ్యక్షుడు శుభ్రకాంత్ పాండా , వివిధ అంతర్జాతీయ స్థాయి నిపుణులు పాల్గొన్న ‘ఇండియా – జపాన్ ఎన్విరాన్మెంట్ వీక్’ సదస్సు కు, దేశంలో దాదాపు 30 రాష్ట్రాల్లో స్టేట్ డేసిగ్నేటేడ్ ఏజెన్సీలు ఉండగా, ఒక్క ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఇంధన పరిరక్షణ మిషన్ ను మాత్రమే ఈ అంతర్జాతీయ సదస్సు కు ది ఎనర్జీ అండ్ రిసోర్సెస్ ఇన్స్టిట్యూట్ (టెరి) ఆహ్వానించడం గమనార్హం. ఆంధ్ర ప్రదేశ్ లో ఇంధనపొదుపు , సామర్థ్యం పెంపు కు సంబంధించి అమలు చేస్తున్న ఉత్తమ ప్రమాణాలు, పద్దతుల గురించి వివరించమని ఎస్ఈసిఎంను కోరారు. అదే సందర్భంగా , ఆంధ్ర ప్రదేశ్ సూక్ష్మ , చిన్న, మధ్య తరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఈ) కు సంబందించి ఎనర్జీ ఎఫిసిఎన్సీ ద్వారా చేకూరే లబ్ది గురించి టెరి ఒక రిపోర్ట్ ను ఆవిష్కరించి ఎస్ఈసిఎం సీఈఓ కు అందచేశారు.
ఇంధన సామర్థ్య సాంకేతికతలోనూ ఏపీని దేశంలోనే ముందు వరసలో నిలిపేందుకు టెరి సిద్ధమైంది. కేంద్ర విద్యుత్తు శాఖ నేతృత్వంలోని బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ (బీఈఈ), ఇతర శాఖలతో సంప్రదింపులు జరిపి.. అవసరమైన అనుమతులు తీసుకున్న తరావత జపాన్ ప్రభుత్వం సహకారంతో ఆంధ్రప్రదేశ్లోని ఎంఎస్ఎంఈలకు లో-కార్బన్ సాంకేతికతలను పరిచయం చేసేందుకు సన్నద్ధమైంది. ‘జపాన్-ఇండియా టెక్నాలజీ మ్యాచ్ మేకింగ్ ప్లాట్ ఫాం (జేఐటీఎంఏపీ)’ మద్దతుతో ఇంధన సామర్థ్య సాంకేతికతలో ఏపీని యావత్ దేశానికే రోల్ మోడల్ గా నిలిపేందుకు కృషి చేయనున్నట్లు టీఈఆర్ఐ అధికారులు తెలిపారు.
రాష్ట్రంలోని ఎంఎస్ఎంఈల్లో జపాన్ టెక్నాలజీలను వినియోగించేందుకు ‘ఇంధనం, వనరుల సంస్థ (టీఈఆర్ఐ)’ సిద్ధమవుతోంది. ప్రస్తుతం ఈ రంగంలో పెద్దగా వాడుకలో లేని, అతితక్కువ సామర్థ్యం కలిగిన సాంకేతికతలను వినియోగిస్తుండడంతో ఇంధన వినియోగం, వృథా పెరిగిపోతున్నాయి. అధునాతన ఇంధన సామర్థ్య సాంకేతికతలను వినియోగించడం వల్ల విద్యుత్తు ఆదాతోపాటు ఉద్గారాలూ తగ్గుతాయి. ఈ క్రమంలోనే ఏపీలోని ఎంఎస్ఎంఈల్లో జపాన్ ప్రభుత్వ సహకారంతో లో-కార్బన్ టెక్నాలజీలను ప్రవేశపెట్టాలని టీఈఆర్ఐ యోచిస్తోంది.
దేశంలో పర్యావరణ మౌలిక సదుపాయాలు, సాంకేతికతల ద్వారా రెసిలెంట్ డీ కార్బనైజ్డ్ సొసైటీ నిర్మాణం అనే అంశంపై టీఈఆర్ఐ ఢిల్లీలో రెండు రోజుల (12, 13వ తేదీల్లో) సమావేశం నిర్వహించింది. అంతర్జాతీయ పర్యావరణ వ్యూహాల సంస్థ (ఐజీఈఎస్) సహకారంతో జపాన్, భారత్ కు చెందిన సంస్థలు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశాయి. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇంధన సంరక్షణ మిషన్ (ఏపీఎస్ఈసీఎం) చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పాల్గొన్నారు. టీఈఆర్ఐ సీనియర్ డైరెక్టర్ గిరీశ్ సేథి మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా ఉన్న ఎంఎస్ఎంఈల్లో ఇంధన సామర్థ్యంపై విస్తృత అవగాహన కల్పించేందుకు గాను జేఐటీఎంఏపీ(JITMAP) కృషి చేస్తోందన్నారు. చౌకగా లభించే టెక్నాలజీలపై ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ లోని ఎంఎస్ఎంఈల్లో లో కార్బన్ టెక్నాలజీలను ప్రవేశపెట్టడానికి అపార అవకాశాలు ఉన్నాయని సేథీ తెలిపారు. రాష్ట్ర ఇంధన శాఖ కు చెందిన ఏపీఎస్ఈసిఎంకు అందించిన TERI నివేదిక ప్రకారం, “ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల విభాగంలో ఇంధన వినియోగం దాదాపు 18,844 మిలియన్ యూనిట్లు (APERC టారిఫ్ ఆర్డర్ 2022-23 ప్రకారం). ఏపీ డిస్కాముల డేటా ప్రకారం, ఇందులో ఆంధ్ర ప్రదేశ్ ఎంఎస్ఎంఈలు సంవత్సరానికి 5000 మిలియన్ యూనిట్ల విద్యుత్ ను వినియోగిస్తున్నాయి. వీటిలో 10 శాతం విద్యుత్తును ఆదా చేసినా.. ఏడాదికి రూ 300 కోట్లు విలువైన 500 మిలియన్ యూనిట్లు ఆదా అవుతాయి” అని సేథీ తెలిపారు .
ఏపీలోని ఆరు ఎంఎస్ఎంఈ క్లస్టర్లలో టీఈఆర్ఐ ఇంధన సామర్థ్య అధ్యయనాలు చేసినట్లు వివరించారు. ఫిషరీస్, రిఫ్రాక్టరీ, ఫౌండ్రీ, స్పిన్నింగ్, దాల్ ప్రాసెసింగ్, కోల్డ్ స్టోరేజీల్లో ఈ అధ్యయనం చేశామని.. అనేక ఇంధన సామర్థ్య విధానాలను సిఫారసు చేశామని తెలిపారు. అధ్యయనం ప్రకారం, భీమవరంలోని సీ ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో సుమారు 65 మిలియన్మ యూనిట్ల , ఫౌండ్రీ క్లస్టర్లో 12 మిలియన్ యూనిట్ల మరియు తూర్పుగోదావరిలోని రిఫ్రాక్టరీ క్లస్టర్లో 2400 మెట్రిక్ టన్నుల బొగ్గుకు సమానమైన థర్మల్ ఇంధనాన్ని ఆదా చేయవచ్చని అంచనా. ఈ మూడు క్లస్టర్లలో, సంవత్సరానికి 65000 టన్నుల కార్బన్ ఉద్గారాలను తగ్గించవచ్చని అంచనా. ప్రస్తుతం జపాన్ కు చెందిన ఇంధన సామర్థ్య సాంకేతికతలను ప్రవేశపెట్టేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు చెప్పారు.
లో కార్బన్ టెక్నాలజీలకు సంబంధించి భారత్-జపాన్ మధ్య పరిశ్రమలు-విద్యాసంస్థల అనుసంధానాన్నీ బలోపేతం చేసేందుకు మంచి అవకాశాలు ఉన్నాయని తెలిపారు. జపాన్ సంస్థ ఇన్స్టిట్యూట్ ఫర్ గ్లోబల్ ఎన్విరాన్మెంట్ స్ట్రాటజీస్ సాంకేతిక సాయంతో రాష్ట్రంలో సుస్థిర వృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు.
ఏపీ ఎంఎస్ఎంఈల్లో జపాన్ ఇంధన సామర్థ్య టెక్నాలజీలను ప్రవేశపెట్టాలన్న టీఈఆర్ఐ ప్రతిపాదనను ఏపీఎస్ఈసీఎం సీఈవో ఎ.చంద్రశేఖరరెడ్డి సాదరంగా స్వాగతించారు. ఈ సందర్భంగా ఆయన ఏపీ ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ సందేశాన్ని చదివి వినిపించారు. ఇంధన సామర్థ్య కార్యకలాపాలకు, ముఖ్యంగా ఎంఎస్ఎంఈలలో ఇంధన సామర్ధ్య కార్యక్రమాలకు సహకారం అందిస్తున్న కేంద్ర ఇంధన శాఖకు చెందిన బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ (బీఈఈ) కి కృతజ్ఞతలు తెలుపుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఇంధన శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి 24×7 నిరంతర, నాణ్యమైన, విద్యుత్ సరఫరాకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని అన్నారు.ఈ లక్ష్య సాధనలో ఇంధన సామర్థ్యం ప్రధాన పాత్ర పోషిస్తుందని తెలిపారు.
ఏపీఎస్ఈసిఎం సుమారు 65 ఎంఎస్ఎంఈ యూనిట్లలో వినూత్న ఐ ఓ తీ (IOT) ఆధారిత ఇంధన సామర్థ్య సాంకేతిక ప్రాజెక్ట్ను అమలు చేసింది. ఇవి జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు పొందాయి. మెటల్ ప్రాసెసింగ్ యూనిట్లు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, ఫిషరీస్, ఫౌండ్రీ, సెరామిక్స్, రిఫ్రాక్టరీ, పౌల్ట్రీ, స్పిన్నింగ్, స్పిన్నింగ్, కోల్డ్ స్టోరేజీలతో కూడిన 19 సబ్ సెక్టార్లతో ఏపీ లో దాదాపు 98000 ఎంఎస్ఎం ఈ ల లో ఇంధన పొదుపు సామర్థ్యాన్ని పరిశ్రమల శాఖ సమన్వయము తో దశలవారీగా గుర్తించి, సరికొత్త సాంకేతికతలను అవలంబించాలని ఏపీఎస్ఈసిఎం యోచిస్తోంద దని సిఈఓ తెలిపారు.
సతోషి కోజిమా, డైరెక్టర్ IGES , పర్యావరణ శాఖ, జపాన్, రజనీ రంజన్ రష్మీ, విశిష్ట సహచరుడు మరియు మాజీ ప్రత్యేక కార్యదర్శి (MOEFCC), ప్రోశాంతో పాల్, అసోసియేట్ డైరెక్టర్ TERI, జపాన్ పర్యావరణ విభాగం (MOEJ), పర్యావరణం, అటవీ మరియు వాతావరణ మార్పు, భారతదేశం (MOEFCC), జపాన్ ఛాంబర్ నుండి ప్రతినిధులు భారతదేశంలో వాణిజ్యం మరియు పరిశ్రమలు (JCCII), ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (FICCI), జపాన్ మరియు భారతీయుల నుండి కార్యనిర్వాహకులు మరియు ఇతర ప్రతినిధులు పాల్గొన్నారు
Prajavartha Online Telugu News