Breaking News

మంత్రి కారుమూరి సంక్రాంతి శుభాకాంక్షలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
తెలుగు ప్రజలకు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించినప్పటి నుంచి సకాలంలో వర్షాలు కురిసి రాష్ట్రం పాడిపంటలతో కళకళలాడుతూ ఉందని.. ఫలితంగా రైతులంతా సుఖసంతోషాలతో ఉన్నారని మంత్రి వివరించారు.సంక్రాంతికి పాడిసంవృద్దిగా ఉండి ధాన్యం ఇంటికి వచ్చి.. గిట్టుబాటు ధరలు లభించడంతో రైతులు సంతోషంగా ఉన్నారని అన్నారు.మరోవైపు జగనన్న సంక్షేమ పథకాలతో పేద వర్గాల ప్రజలు సైతం ఆనందంగా ఉన్నారన్నారు. ఈ సందర్భంలో మూడు రోజుల పాటు జరుపుకునే సంక్రాంతి పండుగను దేశవిదేశాల్లో ఉన్న ప్రతి ఒక్క తెలుగు వారు సహృద్భావ వాతావరణంలో జరుపుకోవాలని మంత్రి ఆకాంక్షించారు. భోగి,మకర సంక్రాంతి,కనుమ పండుగలతో ప్రారంభమైన ఈ ఏడాది మొత్తం సంతోషంగా గడపాలని ఆశిస్తున్నట్లు తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *