Breaking News

కందిపప్పు అక్రమాలపై మంత్రి కారుమూరి సీరియస్…

-విచారణకు ఆదేశం..
-ఎంతటి వారినైనా ఉపేక్షించే ప్రసక్తే లేదు…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రేషన్ షాపుల ద్వారా పేదలకు సరఫరా చేస్తోన్న కందిపప్పు అక్రమాలపై రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు సీరియస్ అయ్యారు. కందిపప్పులో నాణ్యత లోపించడం…కిలో 67 రూపాయల వంతున ఆఫ్రికా నుంచి కొనుగోలు చేసి 120 రూపాయలకు సరఫరా చేయడంపై మంత్రి ఆరా తీశారు. పౌరసరఫరాల శాఖ కమిషనర్ అరుణ్ కుమార్, సంస్థ ఎండీ వీరపాండ్యన్ తో శుక్రవారం సమావేశమైన మంత్రి ఈ కందిపప్పు గోల ఏంటని ప్రశ్నించారు. కాంట్రాక్టర్లు ఎక్కడ నుంచి సేకరిస్తున్నారు…ఎంతకు కొనుగోలు చేస్తున్నారనే వివరాలన్నీ రెండు రోజుల్లో తన ముందు ఉంచాలని ఆదేశించారు. జిల్లా, మండల స్థాయిల్లోని స్టాక్ పాయింట్లలో ఏమైనా గోల్ మాల్ జరుగుతుందా అనేది పూర్తి స్థాయిలో విచారణ జరిపి నివేదిక పంపించాలని స్పష్టం చేశారు. అవకతవకలు, అక్రమాలు జరిగాయని తేలితే ఎంతటివారైనా ఉపేక్షించేది లేదని.. అక్రమార్కుల తాట తీస్తామని మంత్రి హెచ్చరించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *