అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో ధనుర్మాసం చివరి రోజున స్వామి అమ్మవార్ల గిరి ప్రదక్షణ నకు బయలుదేరు ముందు రోజు ప్రదోషమూర్తులు గిరి ప్రదక్షణనకు వెళ్లడం ఆనవాయితీ. త్వరలో జరగబోవు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల లో భాగంగా స్వామి అమ్మ వార్ల కళ్యాణోత్సవానికి కైలాసగిరిలో వెలసి ఉన్న ముక్కోటి దేవతలను ఆహ్వానించేందుకు ఈనెల 16వ తేదీన శ్రీ జ్ఞాన ప్రసూనాంబికా సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి ఉత్సవమూర్తులు బయలుదేరుతారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో అలంకారం మండపంలోని ప్రదోషమూర్తులకు పలు రకాల పుష్పాలతో అలంకరించి విశేష పూజలు నిర్వహించి దూప దీప నైవేద్యాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో శ్రీ కాళహస్తీశ్వర ధర్మకర్తల మండలి అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు మరియు పాలకమండలి సభ్యులు, ప్రత్యేక ఆహ్వానితులు, మరియు ఆలయ ఏ.ఈ.వో సతీష్ మాలిక్ , టెంపుల్ ఇన్స్పెక్టర్లు శ్రీనివాసులు రాజు, కిషోర్ రెడ్డి,రికార్డ్ అసిస్టెంట్ సురేష్, ఏ.పీఆర్.ఓ శ్రీనాథ్ ఆలయ అధికారులు పాల్గొన్నారు
Prajavartha Online Telugu News