-జూపార్కు రోడ్డు లోని అయాన్ డిజిటల్ జోన్ పరీక్షా కేంద్రాన్ని పరిశీలించిన ఉమ్మడి జిల్లా జడ్జి
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రవ్యాప్తంగా హై కోర్టు విడుదల చేసిన 600 ఉద్యోగాల ఖాళీల నోటిఫికేషన్ కు సంబంధించి న్యాయస్థానాలలో ఖాళీగా ఉన్న వివిధ ఉద్యోగాల ఈ నెల 20 న శుక్రవారం జరగనున్న పరిక్షా కేంద్రాన్ని జూపార్కు రోడ్డు లోని అయాన్ డిజిటల్ జోన్ ను జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఇ. భీమారావు గురువారం సాయంత్రం పరిశీలించారు.
తిరుపతి జిల్లాలో చెర్లోపల్లి, జూపార్కు రోడ్డు లోని అయాన్ డిజిటల్ కేంద్రంలో నిర్వహించే పరీక్ష కేంద్రాని పరిశీలించారు. తిరుపతి జిల్లా పరిధిలో సెక్షన్ ఆఫీసర్, కంప్యూటర్ ఆపరేటర్, టైపిస్ట్, కాపీస్ట్, డ్రైవర్, ఆఫీస్ సబార్డినేటర్, అసిస్టెంట్ ఓవర్సీస్ వంటి ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న1168 అభ్యర్థులకు మూడు విడతలలో కంప్యూటర్ అథారిటీ పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని, మొదటి సెషన్ ఉదయం 9 గంటల నుండి 10.30 గంటల వరకు, రెండో సెషన్ మధ్యాహ్నం 12.30 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు, మూడో సెషన్ సాయంత్రం 4 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు జరుగుతాయిని, పరీక్ష కేంద్రాలలో ఆన్ లైన్ పరీక్షల నేపద్యంలో ఇంటర్ నెట్ కనెక్షన్ సౌకర్యం కల్పించాలని సంబంధిత పరీక్షా కేంద్రాల యాజమాన్యానికి ఆదేశించారు. అభ్యర్థులు పరిక్షా సమయానికి గంట ముందుగా హాజరు కావాలని సూచించారు.
పరీక్ష కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీస్ వారిని, వైద్య ఆరోగ్యశాఖ ద్వారా వైద్య సిబ్బందిని, ఓ ఆర్ ఎస్ ప్యాకెట్లు ,మందులు అందుబాటులో ఉంచాలని, విద్యుత్ సరఫరా లో అంతరాయం లేకుండా చూడాలని, త్రాగునీరు వసతి కల్పించాలని, పరీక్షకు హాజరయ్యే విద్యార్థులకు క్యాంటీన్ అందుబాటులో ఉండే విధంగా చూడాలని సంబంధిత వారిని ఆదేశించారు. పరీక్ష కేంద్రాలలో అభ్యర్థులకు హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయాలని, అభ్యర్థులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంత వాతావరణంలో కంప్యూటర్ ఆధారిత పరీక్షలు జరిగే విధంగా సౌకర్యాలు కల్పించాలని సూచించారు.
సెకండ్ అడిషనల్ జడ్జి కోటేశ్వరరావు, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి పవన్ కళ్యాణ్, అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి శిరీష్, అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్ రామచంద్ర నాయుడు, ఎంఆర్ పల్లి ఎస్ఐ వినోద్ కుమార్ తదితర పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News