Breaking News

అన్ని శాఖల సమన్వయంతోనే గృహ నిర్మాణాలలో పురోగతి

-గృహ నిర్మాణాల పురోగతిలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవు: కలెక్టర్

శ్రీకాళహస్తి, నేటి పత్రిక ప్రజావార్త :
పేదలందరికీ ఇల్లు గృహ నిర్మాణ కార్యక్రమం అనేది అన్ని శాఖల సమన్వయంతోనే సాధ్యం అని అన్ని రెవెన్యూ డివిజన్ల హౌసింగ్ రెవెన్యూ, మండల అభివృద్ధి అధికారులు, మునిసిపల్ కమిషనర్లు ఇంజినీరింగ్ అసిస్టంట్ల తో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ కే వెంకట రమణారెడ్డి అన్నారు.

శుక్రవారం సాయంత్రం శ్రీకాళహస్తి ఆర్డీఓ కార్యాలయం నుండి కలెక్టర్ సంబంధిత అధికారులతో మాట్లాడుతూ నవరత్నాలు పేదలందరికీ ఇళ్ళు బృహత్తర పథకం అమలులో తాసిల్దార్లు ఎంపిడిఓ లు లేఔట్ ల వారీగా బాధ్యతలు పంచుకుని హౌసింగ్ అధికారులతో సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. పనితీరులో నిర్లక్ష్య వైఖరి ఉపేక్షించేది లేదని చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఇంజినీరింగ్ అసిస్టెంట్ లు ఇళ్ళ నిర్మాణాల బిల్లులు అప్లోడ్ చేయకుండా, పేమెంట్ లు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని అన్నారు. మౌలిక సదుపాయాల కల్పనలో ఇంటి ఇంటికి త్రాగు నీటి సౌకర్యం, విద్యుత్తు, అంతర్గత రోడ్లు ఏర్పాటు కావాలని అన్నారు.

ఉగాది నాటికి సామూహిక గృహ ప్రవేశాలకు సంబంధించిన లక్ష్యాలను అందిపుచ్చుకోవాలి అన్నారు. అందుకొరకు వీడియో కాన్ఫరెన్స్ అనంతరం తాశిల్డార్లు ఎంపిడిఓ లు సంబంధిత అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించి లేఅవుట్లకు ఇంఛార్జి లను లబ్దిదారుల వారీగా లక్ష్యాల వారీగా ఉత్తర్వులు జారీ చేసి ప్రతులను ఈ రోజు జిల్లా కేంద్రానికి పంపాలని ఆదేశించారు. ప్రణాళిక బద్ధంగా పనిచేయాలని, కలెక్టరేట్ నుండి రోజు వారీగా సమీక్షిస్తామని స్టేజి వారీగా పురోగతి సాధించాలని అన్నారు. ఎక్కడైతే సిమెంట్, కడ్డీలు, వాకిళ్ళు, లోగో లు తదితర సామాగ్రి సిద్ధంగా ఉన్నవాటిని, లబ్ధిదారులను మోటివెట్ చేసి వాటి జాబితా సిద్ధం చేసి నిర్మాణం చేపట్టాలని ఆర్ ఎల్ ఆర్ సీ స్థాయి నుండి పూర్తి స్థాయికి స్టేజి కన్వర్షన్ రావడానికి ముందస్తుగా అవగాహన చేసుకుని లక్ష్యాలు నిర్ణయించుకుని అధికారులు ఉదయమే లబ్ధిదారులను మోటివెట్ చేసి పురోగతి సాధించేలా చర్యలు ఉండాలని అన్నారు. ఇంకా ప్రారంభం కాని ఇళ్లను ప్రారంభించాలని, గోడ స్థాయి పై కప్పు స్థాయి నుండి పూర్తి స్థాయి కి తీసుకు రావాలని అన్నారు. రోజు వారీగా ఆర్ సి నుండి ఇంటి నిర్మాణం పూర్తి చేయుటకు 194 లక్ష్యంగా సంబంధిత మండలాలు మునిసిపాలిటి లు రోజు వారి లక్ష్యాలను సాధించాలని అన్నారు. పురోగతి చూయించని అధికారులపై క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరించారు.

ఈ సమావేశంలో జిల్లా గృహనిర్మాణ శాఖ ఇంఛార్జి అధికారి శ్రీనివాస ప్రసాద్, ఈఈ చంద్ర శేఖర్ బాబు, శేషగిరి, ఆర్డీఓ లు, అన్ని మండలాల తాశిల్దార్లు, ఎంపిడిఓ లు, మునిసిపల్ కమీషనర్ లు, హౌసింగ్ అధికారులు, ఇంజినీరింగ్ అసిస్టెంట్ లు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *