-జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విద్యార్థిని విద్యార్థులలో అంతర్లీనంగా దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసేందుకు సలామ్ ఇండియా ఆర్ట్ కాంటెస్ట్ను నిర్వహించడం అభినందనీయమని జిల్లా కలెక్టర్ ఎస్. డిల్లీరావు అన్నారు. ఫిబ్రవరి 5వ తేదిన నిర్వహించనున్న సలామ్ ఇండియా ఆర్డ్ కాంటెస్ట్కు సంబంధించిన పోస్టర్ను శుక్రవారం జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు ఆయన కార్యాలయంలో విడుదల చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ స్పూర్తి క్రియేటివ్ ఆర్ట్ స్కూల్ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 5వ తేదిన నగరంలోని కాకరపర్తి భవన్నారాయణ కళాశాల (కెబిఎన్ కాలేజ్) నందు నేటి తరం చిన్నారులకు స్వాతంత్య్ర భారత ఔన్నత్యాన్ని, దేశభక్తిని చాటి చెప్పేవిధంగా చిత్రలేఖన పోటీలను నిర్వహించడం అభినందనీయమన్నారు. స్పూర్తి క్రియేటివ్ ఆర్ట్ స్కూల్ ఆధ్వర్యంలో గ్రూప్ `ఏ విభాగంలో కిండర్ గార్డెన్ చిన్నారులకు సెల్యూట్ అవర్ నేషనల్ ఫ్లాగ్, గ్రూప్ `బి విభాగంలో ఒకటి నుండి మూడవ తరగతి విద్యార్థులకు గణతంత్ర దినోత్సవ ఉత్సవాలు, గ్రూప్ ` సి విభాగంలో నాలుగు నుండి ఏడవ తరగతి విద్యార్థులకు యూనిటి ఇన్ డైవర్సిటి, గ్రూప్ `డి విభాగంలో ఎనిమిది నుండి పదోవ తరగతి విద్యార్థులకు ఇండియన్ ఆర్మీ అవర్ డిఫెన్స్, గ్రూప్ ` ఇ విభాగంలో ఇంటర్మీడియట్ పిజి విద్యార్థులకు గ్లోరియస్ హెరిటేజ్ ఆఫ్ ఇండియా అంశాలపై చిత్ర లేఖన పోటీలను నిర్వహించడం జరుగుతుందని ఆయన తెలిపారు. పోటీలలో పాల్గొనే చిన్నారులు, విద్యార్థులకు ఎటువంటి ప్రవేశ రుసుము లేకుండా ఉత్తమ ప్రతిభ కనపరచిన విద్యార్థులకు ప్రోత్సహక బహుమతులు అందజేయడం పట్ల నిర్వహకులను అభినందిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డిల్లీరావు తెలిపారు. పోస్టర్ ఆవిష్కరణలో డా. బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటి స్పెషల్ ఆఫీసర్ డా. వెలగా జోషి, కెబిఎన్ కాళాశాల ప్రిన్సిపల్ డా. వి. నారాయణ రావు, స్పూర్తి క్రియేటివ్ ఆర్డ్ స్కూల్ డైరెక్టర్ శ్రీనివాస్ పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News